Advertisementt

టాక్ వీక్.. అయినా 100 కోట్ల క్లబ్‌లోకి..!

Fri 26th Apr 2019 09:53 PM
lawrence raghava,kanchana 3,100 crores club,jersey,south film industry  టాక్ వీక్.. అయినా 100 కోట్ల క్లబ్‌లోకి..!
Raghava Lawrence Kanchana 3 Enters 100 Crore Club టాక్ వీక్.. అయినా 100 కోట్ల క్లబ్‌లోకి..!
Advertisement
Ads by CJ

రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 సినిమా గత శుక్రవారం విడుదలైంది. తెలుగులో నాని జెర్సీ సినిమాతో పోటీపడిన కాంచన 3 తమిళంలో సోలో ఫైట్‌కి దిగింది. కాంచన 3 విడుదలైన ఫస్ట్ షో‌కి టాక్ కాస్త తేడా కొట్టినా.. తర్వాతర్వాత పుంజుకుంది. కాంచన సీక్వెల్‌గా తెరకెక్కిన కాంచన 3ని క్రిటిక్స్ కూడా తూర్పారబట్టారు. అయితే విచిత్రంగా టాక్‌తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న జెర్సీ‌కి షాకిస్తూ అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళనాట రాఘవ కాంచన 3 బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి క్లాస్ మూవీస్ గా మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలకొచ్చిన టాక్ మాస్ మూవీ కాంచన 3 కి రాకపోయినా... కాంచన 3 మాత్రం ఆ క్లాస్ మూవీ కలెక్షన్స్ కి అందనంత ఎత్తులో నిలబడింది.

మరి వరల్డ్ వైడ్ గా రాఘవ లారెన్స్ కాంచన త్రీ మొదటి వారం ముగిసేసరికి ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకే షాకిచ్చింది. బ్యాడ్ టాక్ తో ఇన్ని కోట్లు కొల్లగొట్టిన కాంచన 3 కన్నా... మాస్ ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదనేది కాంచన 3 ప్రూవ్ చేసి చూపించింది. మరి ఇంతటి నెగెటివ్ టాక్ తో కాంచన 3 చిత్రం 100 కోట్లు కొల్లగొట్టి... రాఘవని మొదట్టమొదటిసారిగా 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేలా చేసింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కాంచన, గంగ సినిమాలు కూడా కొల్లగొట్టని ఫిగర్‌ని బ్యాడ్ టాక్‌తో కాంచన 3 కొల్లగొట్టింది. 

Raghava Lawrence Kanchana 3 Enters 100 Crore Club:

Talk Weak.. But Movie gets Decent Hit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ