Advertisementt

బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టినా.. ఈ భామ ఖాళీనే?

Fri 26th Apr 2019 09:22 PM
mehreen kaur pirzada,f2 movie,no movies,empty,no offers  బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టినా.. ఈ భామ ఖాళీనే?
Hit Heroine turns Empty Heroine బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టినా.. ఈ భామ ఖాళీనే?
Advertisement
Ads by CJ

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన క్యూట్ గర్ల్ మెహ్రీన్ కౌర్ పరిస్థితి ఇప్పుడు అస్సలేం బాగోలేదు. ఏదో పేరెంట్స్‌తో టూర్స్ వేస్తూ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేసిన అమ్మడుకి అవకాశమే రావడం లేదు. ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. మెహ్రీన్ కి అవకాశాలే లేవు. ఆఖరుకి వెయిట్ తగ్గినా ఫలితం శూన్యం. బబ్లీ గా ఉన్న మెహ్రీన్ బరువు తగ్గితే అవకాశాలు పెరుగుతాయనుకుంది. అందుకే జిమ్‌లో బాగా వర్కౌట్స్ చేసి మరీ బరువు తగ్గే ప్రయత్నాలు చేసింది. ఎఫ్ 2లో కాస్త సన్నబడి స్విమ్ సూట్ వేసినా.. మెహ్రీన్ కెరీర్ బాగుపడింది లేదు.

స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు ఎలా ఉన్నప్పటికీ.. కనీసం మీడియం రేంజ్ హీరోల పక్కన కూడా మెహ్రీన్ కి నో ఛాన్స్ బోర్డు కనబడుతుంది. మరి ఈ ఖాళీ సమయంలో తల్లితండ్రులతో కలిసి టూర్స్ వేస్తూ కాలం గడిపేస్తుంది. పాపం మెహ్రీన్ కౌర్ కెరీర్ క్లోజ్ అయినట్లే కనబడుతుంది. ఒక్క హీరో అంటే ఒక్క హీరో కూడా మెహ్రీన్‌ని ఆదుకోవడానికి సిద్ధంగా లేరా.. గతంలో మెహ్రీన్ వరస హిట్స్ కొట్టినా... ఆమెకి బ్రేకిచ్చే సినిమా ఒక్కటి కూడా పడలేదు. అందుకే మెహ్రీన్ కి ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ వచ్చినా.. ఛాన్సులు మాత్రం లేవు.

ఎఫ్ 2 విడుదలై అప్పుడే నాలుగు నెలలు పూర్తయ్యాయి కానీ.. మెహ్రీన్ కి ఒక్క ఆఫర్ కూడా వచ్చే ఛాన్స్ మాత్రం కనబడ్డం లేదు. చూద్దాం మెహ్రీన్ ని ఎవరైనా హీరో ఆదుకుంటారా.. లేదంటే ఆమె కెరీర్ కి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందో అనేది.

Hit Heroine turns Empty Heroine:

No Movies to Heroine Mehreen Kaur Pirzada

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ