Advertisementt

మహేష్ 25 ఫిల్మ్ ప్రీ రిలీజ్ విశిష్టత ఇదే!

Thu 25th Apr 2019 08:02 PM
mahesh babu,maharshi movie,pre release event,special arrangements  మహేష్ 25 ఫిల్మ్ ప్రీ రిలీజ్ విశిష్టత ఇదే!
This is the Special in Maharshi Pre Release Event మహేష్ 25 ఫిల్మ్ ప్రీ రిలీజ్ విశిష్టత ఇదే!
Advertisement
Ads by CJ

మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాపై మొదటి నుండి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో పాటు కొన్ని స్టిల్స్ తో టీం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆల్రెడీ ఈమూవీ నుండి మూడు పాటలు బయటకు వచ్చాయి. అయితే మూడు పాటలు అంతగా ఆకట్టులేకపోయాయి. కానీ నిన్న రిలీజ్ అయిన నాలుగో సాంగ్ ‘పదరా .. పదరా .. పదరా .. నీ అడుగుకి పదునుపెట్టి పదరా’ అదరగొట్టేసింది.

దేవిశ్రీ సంగీతం అందించిన ఈ సాంగ్స్ ప్రేక్షకుల్లో అంత క్రేజ్ లేకపోయినా నాలుగో సాంగ్ తో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచేసింది. ముఖ్యంగా లిరిక్స్ తో పాటు శంకర్ మహదేవన్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఈమూవీ మే 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఇది మహేష్ 25 వ చిత్రం కావడంతో ఈ ఈవెంట్ కి మహేశ్ గత 24 చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్లందరినీ ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అందుకే ఈ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా  నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహలు చేస్తోంది. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

This is the Special in Maharshi Pre Release Event:

Special Arrangements for Mahesh Babu 25th film Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ