Advertisementt

నాగ్ ఆ దర్శకుల్ని లాక్ చేసేశాడా..!

Tue 23rd Apr 2019 07:27 PM
naga chaitanya,akhil,nagarjuna,ajay bhupati,shiva nirvana,gautham tinnanuri  నాగ్ ఆ దర్శకుల్ని లాక్ చేసేశాడా..!
Nag Locked Young Talented Directors For Chaitu and Akhil నాగ్ ఆ దర్శకుల్ని లాక్ చేసేశాడా..!
Advertisement
Ads by CJ

ఈ మధ్య ఏదైనా యువ దర్శకుడు హిట్‌ ఇచ్చాడు అంటే వెంటనే నాగార్జున ఆ డైరెక్టర్లను తన కాంపౌండ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. శ్రీరామ్‌ ఆదిత్య, కళ్యాణ్‌కృష్ణ, వెంకీ అట్లూరి, చందు మొండేటి, సుధీర్‌వర్మ.. ఇలా ఎందరినో లైన్‌లో పెడుతూ, తన బేనర్‌లో కాకపోయినా తనతో గానీ తన కుమారులతో కానీ చిత్రాలు చేసేందుకు ఒప్పిస్తున్నాడు. ప్రస్తుతం రాహుల్‌రవీంద్రన్‌ని కూడా తనతో తెచ్చుకున్నాడు. విక్రమ్‌ కె.కుమార్‌తో ‘మనం, హలో’ చిత్రాలు తీశాడు. ప్రస్తుతం ఆయన కళ్లు ముగ్గురు యంగ్‌దర్శకుల మీద ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

గత కొంతకాలంగా పెట్టిన పెట్టుబడి, వచ్చిన లాభాలతో పోలిస్తే ‘ఆర్‌ఎక్స్‌100’ సాధించిన విజయం మరే చిత్రం సాధించలేదు. కొత్తవారితో తాను కొత్తవాడైన అజయ్‌ భూపతి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక రెండో చిత్రానికి అజయ్‌ భూపతి కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో ఓ మల్టీస్టారర్‌ తీయాలని భావించాడు. హీరోయిన్‌గా సమంతని ఒప్పించాడు. కానీ ఏవో కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. వెంటనే నాగ్‌ నుంచి అజయ్‌కి ఫోన్‌ వచ్చిందట. ఇటీవలే అజయ్‌భూపతి నాగచైతన్య, సమంతలకు సరిపోయే మంచి కథను వినిపించడం, దానికి నాగార్జున ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. 

పెళ్లికి ముందు ‘ఏమాయ చేశావే, మనం, ఆటోనగర్‌ సూర్య’ వంటి చిత్రాలలో నటించిన చైతూ, సమంతలు పెళ్లయిన తర్వాత తొలిసారిగా ‘మజిలీ’లో నటించారు. ఈ చిత్రం సాధించిన విజయం, ఇందులో చైతు, సమంతలు చూపించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరలా అతి తక్కువకాలంలోనే మరోసారి చైతు, సమంతలు అజయ్‌భూపతి దర్శకత్వంలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేగాక తన పెద్దకుమారుడు నాగచైతన్య, కోడలు సమంతలకు మరిచి పోలేని గిఫ్ట్‌ ఇచ్చిన దర్శకుడు శివనిర్వాణను కూడా నాగ్‌ టచ్‌లో పెట్టుకున్నాడట. 

ఈయన దర్శకత్వంలో అఖిల్‌తో ఓ చిత్రం చేయాలనేది నాగ్‌ ఆలోచనగా చెబుతున్నారు. ఇక తన మొదటి చిత్రం ‘మళ్లీరావా’ని తన మేనల్లుడు సుమంత్‌తో చేసి రెండో చిత్రం నానితో ‘జెర్సీ’ అంటూ అద్భుత విజయం సాధించిన గౌతమ్‌ తిన్ననూరిని కూడా నాగ్‌ టచ్‌లోకి తెచ్చుకున్నాడని, గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించే మూడో చిత్రం అక్కినేని హీరోలతోనే ఉంటుందని తెలుస్తోంది. 

Nag Locked Young Talented Directors For Chaitu and Akhil:

Chaitu and Akhil Movies with Ajay Bhupati, Shiva Nirvana and Gautham Tinnanuri

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ