నాగచైతన్య మొదటి చిత్రం జోష్. దీనిని ఏరికోరి నాగార్జున దిల్‌రాజు చేతులకి అప్పగించాడు. కానీ చిత్రం సరిగా ఆడలేదు. ఇక హీరోగా నాగచైతన్యకి అప్పటివరకు తన కెరీర్‌లో మంచి హిట్‌ని ఇచ్చిన చిత్రం 100%లవ్, గీతాఆర్ట్స్‌బేనర్‌లో అల్లుఅరవింద్ నిర్మాతగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ నాగచైతన్య కెరీర్‌లో వన్ ఆఫ్‌ది బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇక విషయానికి వస్తే అక్కినేని వారి చిన్నబ్బాయ్ అఖిల్‌ని నాగార్జున మొదటి చిత్రం నితిన్, వినాయక్‌ల చేతిలో పెట్టాడు. మరలా నాగచైతన్య ఎఫెక్ట్‌నే ఈ చిత్రం కూడా రిపీట్ చేసింది. అఖిల్ గా వచ్చిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రెండో చిత్రాన్ని తానే చేతుల్లోకి తీసుకుని ఇంటెలిజెంట్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌తో హలో తీశాడు. ఈ చిత్రం మనస్సంతా నువ్వేకి లేటెస్ట్ వెర్షన్ అనే విమర్శలు ఎదుర్కొంది. సినిమాకి పాజిటివ్ టాకే వచ్చినా చిత్రం మాత్రం కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.
ఇక అఖిల్ మూడో చిత్రం తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరికి అప్పగించి మిస్టర్ మజ్ను చేసినా నిరాశ తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున అఖిల్ నాలుగో చిత్రాన్ని మరలా అల్లుఅరవింద్ చేతుల్లో పెట్టాడు. బొమ్మరిల్లు తర్వాత పరుగుతో ఫర్వాలేదనిపించి అప్పటి నుంచి వరస డిజాస్టర్స్ అందించిన బొమ్మరిల్లు భాస్కర్ దీనికి దర్శకుడు. కాగా ఈ చిత్రంలో అఖిల్ సరసన కైరా అద్వానీ నటిస్తోందని వార్తలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు అఖిల్‌కి జోడీగా ఛలో, గీతగోవిందం వంటి చిత్రాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన కన్నడ భామ రష్మికా మందన్నని ఎంచుకున్నారట.
ప్రస్తుతం యూత్‌లో క్రేజ్‌పరంగా చూసుకుంటే రష్మికా ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ అయితే కన్నడలో కూడా ఈ చిత్రానికి క్రేజ్ లభిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యంగ్ హీరోయిన్లలో రష్మికా మందన్న ఒకరు అయినా అల్లుఅరవింద్ ఆమెకే ఓటు వేశాడు. మరి నాలుగో చిత్రంతో అయినా అఖిల్‌కి నికార్సయిన హిట్ వస్తుందో లేదో చూడాలి....!