హీరోయిన్ రష్మిక టాలీవుడ్ లో లక్కీ గర్ల్ గా మారబోతుంది. ఎక్కడ చూసిన రష్మికనే కనపడుతుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు మాములు క్రేజ్ లేదు. చిన్న హీరోలు దగ్గరనుండి పెద్ద హీరోలు వరకు అంతా ఈమెనే కావాలంటున్నారు. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించింది.
అలానే నితిన్ హీరోగా భీష్మ అనే సినిమాలో కూడా సెలెక్ట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అయింది. ఇక లేటెస్ట్ గీత ఆర్ట్స్ లో మరో సినిమా ఓకే చేసింది. అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు.
అలా వరస ఆఫర్స్ తో బిజీగా ఉన్న రష్మిక అల్లు అర్జున్ సినిమాలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమెకు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కి లేదు. ఈమె తరువాత పూజాహెగ్డే ఉంది. రకుల్, రాశీల టైం అయిపోయింది. అందుకే రష్మిక ఏ ఆఫర్ వచ్చిన వద్దు అనకుండా అన్ని ఓకే చేస్తూ కెరీర్ ని ఓ గాడిలో పెడుతుంది.