Advertisementt

రాజ్ తరుణ్, దిల్ రాజుల ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’!!

Mon 22nd Apr 2019 08:01 PM
raj tarun,dil raju,iddari lokam okate,new movie,opening,details  రాజ్ తరుణ్, దిల్ రాజుల ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’!!
Raj Tarun New Movie Launched రాజ్ తరుణ్, దిల్ రాజుల ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’!!
Advertisement
Ads by CJ

రాజ్‌త‌రుణ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రారంభ‌మైన కొత్త చిత్రం ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’

ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర‌పై యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ హీరోగా ఓ కొత్త చిత్రం ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. జి.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు, శిరీష్ ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్లాప్ కొట్ట‌గా.. ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు మ‌న‌వ‌డు మాస్ట‌ర్ ఆరాన్ష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా...

దిల్‌రాజు మాట్లాడుతూ - ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’ రాజ్‌త‌రుణ్‌తో మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న రెండో చిత్రం. జి.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తుండ‌గా.. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌ల‌ను అందిస్తున్నారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చేలా సినిమా ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’ అన్నారు. 

రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి 

ద‌ర్శ‌క‌త్వం:  జి.ఆర్‌.కృష్ణ‌, సంగీతం:  మిక్కీ జె.మేయ‌ర్‌, కెమెరా:  స‌మీర్ రెడ్డి, డైలాగ్స్‌:  అబ్బూరి ర‌వి, ఎడిట‌ర్:  త‌మ్మిరాజు

Raj Tarun New Movie Launched:

Raj Tarun and Dil Raju Movie Iddari Lokam Okate

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ