Advertisementt

సమాజం కోసం ముగ్గురు డాక్ట‌ర్ల కృషే ‘ఎమ్‌బిఎమ్’

Mon 22nd Apr 2019 07:25 PM
mera bharath maahan,mbm,pre release event,mbm movie  సమాజం కోసం ముగ్గురు డాక్ట‌ర్ల కృషే ‘ఎమ్‌బిఎమ్’
MBM Movie Pre Release Event Highlights సమాజం కోసం ముగ్గురు డాక్ట‌ర్ల కృషే ‘ఎమ్‌బిఎమ్’
Advertisement
Ads by CJ

దేశానికి వైద్యం చేస్తోన్న ఈ ముగ్గురు డాక్ట‌ర్స్‌ను అభినందించి, ఆశీర్వ‌దించాలి: ‘ఎమ్‌బిఎమ్’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో అతిథులు 

ప్రత ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై భ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ వైద్యులు డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర, డా.తాళ్ల ర‌వి, డా. టి.ప‌ల్ల‌వి రెడ్డి  సంయుక్తంగా తొలిసారిగా నిర్మిస్తోన్న చిత్రం ‘ఎమ్‌బిఎమ్‌’(మేరా భార‌త్ మ‌హాన్‌). అఖిల్ కార్తిక్, ప్రియాంక శ‌ర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న చిత్రం ఈ నెల 26న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లోని ఫిలించాంబ‌ర్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మేథావులు, విద్యావేత్త‌లు, సంఘ సంస్క‌ర్త‌లు, రైతు సంఘాల నాయ‌కులు పాల్గొని.. ‘‘వైద్య వృత్తిలో ఉన్న ముగ్గురు మిత్రులు క‌లిసి స‌మాజానికి ప‌ట్టిన రుగ్మ‌త‌ను తొలిగించ‌డానికి  ముందుకు రావ‌డం అభినందించ‌ద‌గ్గ విషయం. ‘ఎమ్‌బిఎమ్’ చిత్రాన్ని విద్య, వైద్యంతో పాటు రైతు స‌మ‌స్య‌ల గురించి చాలా చ‌క్క‌గా, ప్ర‌తి ఒక్క‌రినీ క‌ద‌లించే విధంగా, ఆలోచింప‌జేసే విధంగా తెర‌కెక్కించారు. ఇందులో వికాసంతో పాటు యువ‌త‌ను ఆక‌ట్టుకునే వినోదం కూడా బావుంది. ఈ సినిమా విజ‌య‌వంత‌మై యూనిట్ అంద‌రికీ మంచి పేరు రావాలి’’ అని ఆకాంక్షించారు.

చిత్ర నిర్మాత‌, క‌థా ర‌చ‌యిత‌, న‌టుడు నిర్మాత డా.శ్రీధ‌ర్ రాజు ఎర్ర మాట్లాడుతూ.. “స‌మ‌కాలీన అంశాల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి ఓ సందేశాత్మ‌క చిత్రంగా నిర్మించాం. అలాగే ఇప్ప‌టి ప్ర‌భుత్వాలు ప్రవేశ‌పెడుతోన్న ప‌థ‌కాలు, వాటిలో లోటు పాట్లు చూపిస్తున్నాం. రెండు కుటుంబాలలో జ‌రిగిన యథార్థ సంఘ‌ట‌న‌లు కూడా పొందుప‌రిచాం. గ‌తంలో ప‌లు సామాజిక అంశాల‌తో కూడిన చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భ‌ర‌త్ గారు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించారు. సెన్సార్ పూర్తైంది. వారు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ నెల 26న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ డా.తాళ్ల ర‌వి మాట్లాడుతూ.. “దేశం బాగుప‌డాలంటే యువ‌త సంక‌ల్పించాలి. స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌ను అరిక‌ట్టే బాధ్య‌త వారిదే కాబ‌ట్టి నేటి యువ‌త‌ను చైత‌న్య ప‌రిచే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. నేను, మిత్రుడు శ్రీధ‌ర్ రాజు ఎన్నో సోష‌ల్ ఎవేర్‌నెస్ కార్య‌క్ర‌మ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ.. సినిమా మాధ్య‌మం ద్వారా మ‌రింత మందికి చేరువవుతుంద‌ని ఈ సినిమా తీసాం’’ అన్నారు.

మ‌రో నిర్మాత డా.టి.ప‌ల్ల‌వి రెడ్డి మాట్లాడుతూ.. “సందేశంతో పాటు మా చిత్రంలో మంచి వినోదం కూడా ఉంటుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇలాంటి చిత్రాలు చాలా అవ‌స‌రం. ముఖ్యంగా యువ‌త‌కు మంచి సందేశం ఇస్తూ.. ల‌వ్ స్టోరీని కూడా మిక్స్ చేశాం. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం. ఎర్రం శెట్టి సాయి డైలాగ్స్, లలిత్ సురేష్ మ్యూజిక్ , పెద్దాడమూర్తి సాహిత్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ‌గా నిలుస్తాయి’’ అని అన్నారు

ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ మాట్లాడుతూ.. ‘‘సామాన్యుల‌కు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే స‌మాజం బాగుంటుంద‌నే సామాజిక స్పృహతో పాటు, లవ్, కామెడీ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాం. ముగ్గురు నిర్మాత‌లు ఒక మంచి ఉద్ధేశ్యంతో వ‌చ్చారు. వారి భావాలు కూడా నా భావాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండటంతో ఈ సినిమా చేసాం. మ‌న సిస్ట‌మ్ లో ఉన్న లోటు పాట్ల‌ను స‌వ‌రించాల‌న్న‌దే మా అభిప్రాయం. ముఖ్యంగా విద్య‌, వైద్యం ఈ రెండు ఉచితంగా అందించాల‌న్న‌దే మా పోరాటం. మాకు స‌పోర్ట్ చేస్తార‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు. 

ఫేమ‌స్ రైట‌ర్ అంప‌శ‌య్య నవీన్ మాట్లాడుతూ... ‘‘శ్రీధ‌ర్ ప‌లు హాస్పిట‌ల్స్ న‌డుపుతూ ఎంతో మందికి సాయ ప‌డుతున్నాడు. ఇప్పుడు ఒక మంచి సందేశంతో ఈ సినిమా చేసాడు. నేను సినిమా చూసాను. అంద‌రికీ చేరువ‌య్యేలా సినిమాలో అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలున్నాయి’’ అన్నారు.

హీరో అఖిల్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘భ‌ర‌త్ గారితో సినిమా చేయ‌డం గొప్ప ఎక్స్‌పీరియ‌న్స్. ఒక మంచి సినిమాలో నేను కూడా పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ఇటీవ‌ల వ‌రంగ‌ల్ జిల్లాలో అప్పుల బాధ‌తో మ‌ర‌ణించిన రెండు రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించి, ప్ర‌భుత్వాలు వెంట‌నే ఆ రెండు క‌టుంబాల‌ను  ఆదుకోవాల‌ని నిర్మాత డా. శ్రీధ‌ర్ రాజు విన్న‌వించారు. 

బాబు మోహన్, త‌ణికెళ్ల భ‌ర‌ణి, గిరిబాబు, ఆమని, నారాయణ రావు, ఎల్ బి శ్రీరాం, త‌దిత‌రులు ఈ చిత్రంలోని తారాగణం.

MBM Movie Pre Release Event Highlights:

Celebrities Speech at Mera Bharath Maahan Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ