కొన్ని కొన్ని చిత్రాలను చూసుకుంటే అందులో నటించిన హిట్ పెయిర్స్‌ని మర్చిపోవడం కష్టం. దేశం మెచ్చిన నటుడు, ముఖ్యంగా దక్షిణాదిలో దశాబ్దం ముందు లవర్‌బోయ్‌గా ఓ వెలుగు వెలిగిన నటుడు సిద్దార్ద్. ఆయన త్రిషతో కలిసి ప్రభుదేవా దర్శకత్వంలో ఎంయస్‌రాజు నిర్మాతగా తీసిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’తో సిద్దార్ధ్ మేనియా మారుమోగిపోయింది. కానీ ఒకటి రెండు హిట్స్ తప్ప సిద్దార్ద్‌కి ఆ తర్వాత సరైన హిట్స్ రాలేదు. తెలుగులోనే కాక తమిళంలో కూడా ఆయన డీలా పడ్డాడు. ఇటీవలే ‘గృహం’ అనే డబ్బింగ్ హర్రర్ చిత్రంతో వచ్చి ఫర్వాలేదనిపించుకున్నాడు.
ఇక విషయానికి వస్తే బాలీవుడ్‌లో అద్భుత విజయం సాధించిన చిత్రం ‘అందాదాన్’. ఇది టాప్‌గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని సౌత్‌లో రీమేక్ చేసేందుకు భారీ కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో మరలా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత 13ఏళ్ల గ్యాప్‌కి మరలా సిద్దార్ద్, త్రిషలు జంటగా నటించబోతున్నారని సమాచారం. ఇటీవలే త్రిష ‘96’ తో మంచి హిట్ కొట్టింది. ఇక ఒకవైపు మురుగదాస్ రజనీతో ‘దర్బార్’ చిత్రం తీస్తూనే మరోవైపు తన శిష్యుడు శరవణన్ దర్శకత్వం వహించే చిత్రానికి కథ, కథనాలను అందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందనున్న ఇందులో త్రిషపై భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఈ తరహా చిత్రం చేయడం త్రిషకి ఇదే మొదటిసారి అంటున్నారు.
సాధారణంగా 13ఏళ్ల కిందట నటించిన జంట అంటే హీరో ఇంకా హీరోగానే కొనసాగుతూ ఉంటాడు గానీ హీరోయిన్లు మాత్రం ఫేడవుట్ అవుతూ ఉంటారు. కానీ త్రిష, సిద్దార్ద్‌ల విషయంలో ఇది తిరగబడిందనే చెప్పాలి. పెళ్లి క్యాన్సిల్ తర్వాత త్రిష వరుస విజయాలు ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక ‘అందాదాన్’ చిత్రానికి శ్రీరామ్ శ్రీరాఘవ దర్శకత్వం వహించనున్నాడు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఇటీవల సిద్దార్ద్ కూడా తెలిపాడు. బాలీవుడ్‌లో రాధికా ఆప్టే చేసిన పాత్రను తమిళ, తెలుగు భాషల్లో త్రిష చేయనుందట.
మరి ఇన్నేళ్ల తర్వాత మరలా సిద్దార్ద్, త్రిషల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? నాటి మ్యాజిక్‌ని రిపీట్ చేస్తారా? లేదా అనేది చూడాలి. మరోవైపు ‘అందాదాన్’ చిత్రాన్ని చైనాలో ‘ది పియానో ప్లేయర్’గా రిలీజ్ చేస్తే అక్కడ ఈ చిత్రానికి 200కోట్లు వసూలు కావడంతో ఈ చిత్రం సత్తా ఏమిటి? అనేది తెలుస్తుంది. మరి ఈ రీమేక్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచిచూడాల్సివుంది.