కోలీవుడ్ లో, కన్నడలో కొన్ని సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న.. శ్రద్ద శ్రీనాధ్ పరిచయం తెలుగు వారికీ నాని జెర్సీ సినిమాతోనే దొరికింది. నానికి గర్ల్ ఫ్రెండ్ గా భార్యగా సారా పాత్రలో అదరగొట్టేసింది. నిన్న శుక్రవారం విడుదలైన జెర్సీ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కేవలం ప్రేక్షకులే కాదు.. క్రిటిక్స్ కూడా జెర్సీ సినిమాకి బ్లాక్ బస్టర్ మార్కులేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ ప్రమోషన్స్ తో ఎన్నో అంచనాల మధ్యన విడుదలైన జెర్సీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ద శ్రీనాధ్ నటనను అందరూ తెగ పొగిడేస్తున్నారు. నాని లవర్ గా, భార్య గా, పదేళ్ల కొడుక్కి తల్లిగా శ్రద్ద శ్రీనాధ్ నటన అద్భుతం అంటున్నారు.
ఇక జెర్సీ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్ హీరోయిన్ అనగానే ఆమెలో గ్లామర్ యాంగిల్ లేదు, నాని పక్కన శ్రద్ద సూట్ అవుతుందా అనే అనుమానాలు చాలామంది వ్యక్తం చేశారు. కానీ సినిమాలో గ్లామర్ పరంగా శ్రద్ద శ్రీనాధ్ చాలా సింపుల్ లుక్స్ ఇచ్చినా... నటన పరంగా శ్రద్ద శ్రీనాధ్ నటనకు బోలెడన్ని మార్కులు పడిపోతున్నాయి. నాని - శ్రద్ద మధ్యన కెమిస్ట్రీ అదుర్స్ అన్న రేంజ్ లో పండింది. అంతేనా ఎమోషనల్ సీన్స్ లోను శ్రద్ద శ్రీనాధ్ నటన సూపర్. శ్రద్ద శ్రీనాధ్ నటనతో నానితో పోటీ పడింది అంటేనే.. ఆమె నటనను ఎంతెలా మెచ్చుకోవాలో అర్ధమవుతుంది. మరి ఈ సింపుల్ కన్నడ గర్ల్ బోలెడంతమంది యంగ్ అండ్ సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందేమో చూద్దాం.