దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు బి.ఎ సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ బ్యానర్‌పై విశ్వాస్ హన్నుర్కర్ నిర్మాతగా నూతన దర్శకుడు రాఘవేంద్ర వర్మ డైరెక్షన్‌లో ‘ఈనగరానికి ఏమైంది’ ఫేమ్ సాయిసుశాంత్, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి హీరోయిన్స్‌గా కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..
నిర్మాత విశ్వాస్ హన్నుర్కర్ మాట్లాడుతూ - ‘‘కామెడీ.. ఫాంటసీ నేపథ్యంలో సాగే చిత్రమిది. సాయి సుశాంత్ రెడ్డి, చాందిని చౌదరి, సిమ్రాన్ చౌదరి సహా మంచి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.
నటీనటులు:
సాయి సుశాంత్ రెడ్డి
చాందిని చౌదరి
సిమ్రాన్ చౌదరి
తనికెళ్ళ భరణి
ప్రియదర్శి
మకరంద్ దేశ్పాండే
శిశిర్ శర్మ
ఝాన్సీ
వినీత్‌కుమార్
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: కె.రాఘవేంద్రరావు బి.ఎ
నిర్మాత: విశ్వాస్ హన్నుర్కర్
దర్శకత్వం: రాఘవేంద్ర వర్మ
రచయిత: అక్షయ్ పూళ్ల
కెమెరా: సతీష్
సంగీతం: జోష్.బి
ఎడిటింగ్: గౌతంరాజు
ఆర్ట్: శ్రీకాంత్ రామిశెట్టి