తెలుగులో బిరుదులకు విలువలేదు. ఎవరికి వారు తమ పేరు ముందు ఏ బిరుదు ఉండాలో వారే నిర్ణయించుకుంటూ ఉంటారు. నాగార్జున వంటి సీనియర్‌స్టార్ కూడా ఇకపై తనని యువసమ్రాట్ అని పిలవవద్దని, ‘కింగ్’ అని పిలవాలని ఆ బిరుదును ఆయనే సూచించాడు. ఇక కిందటి కాలంలో సినీ వారపత్రిక జ్యోతిచిత్ర సూపర్‌స్టార్ బిరుదు కోసం కంటెస్ట్ నిర్వహించేది. దీనిలో కృష్ణ, చిరంజీవి పోటీ పడితే ప్రతిసారి కృష్ణనే ఆ పోల్‌లో విజయం సాధించేవాడు. దీని వెనుక కుట్ర ఉందని కూడా నాడు వార్తలు వచ్చాయి. మ్యానిపులేట్ చేసేవారని విమర్శలు ఉన్నాయి. ఇక నేటితరం వారసులకు బిరుదులకు కొదువ లేదు. వారి మొదటి చిత్రం కూడా విడుదల కాకముందే వారి వంశానికి చెందిన స్టార్స్‌కి సరిపడా కొత్త బిరుదుని సృష్టించి వారి పేరుముందు తగిలిస్తున్నారు.
కానీ నిజానికి నేడు సొంతగా, ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన రవితేజకి ‘మాస్ మహారాజా’, నాని ‘నేచురల్‌స్టార్’, విజయ్‌దేవరకొండ ‘రౌడీస్టార్’ వంటివి మాత్రమే మీడియా, అభిమానుల నుంచి స్వచ్చంధంగా వారి టాలెంట్‌ని చూసి వచ్చిన అసలుసిసలు బిరుదులని చెప్పాలి. ఇక నాని విషయానికి వస్తే ఆయన నటన, టాలెంట్‌ని తగ్గట్లుగా ఆయనను నేచురల్‌స్టార్ అని పిలుస్తారు. ఆయన ఏకంగా 50కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యాడు. దీనిపై నాని మాట్లాడుతూ, మొదట్లో నేచురల్‌స్టార్ అని ఎవరైనా పిలిస్తే కాస్త ఇబ్బందిగా ఫీలయ్యేవాడిని. కానీ ప్రస్తుతం మాత్రం ఆ బిరుదును స్వీకరిస్తున్నాను. మా అమ్మనాన్న నాకు పెట్టిన పేరు నవీన్. అదే సినిమాలలో మాత్రం నాని పేరు వచ్చి చేరింది. అభిమానులు నేచురల్‌స్టార్ అంటూ పిలుస్తున్నారు. వారు అలా అభిమానంతో పిలుస్తున్న బిరుదు నాకు సంతోషాన్నిస్తోంది.
మొదట ఇంత, ఇలాంటి బిరుదులు నాకు అవసరమా? అనిపించేది. కానీ వారు ప్రేమతో పిలుస్తుంటే మాత్రం కాదనలేకపోతున్నాను. ఏ హీరోకైనా కంటెంట్ ఉంటేనే స్టార్‌డమ్ వస్తుంది. ఈమధ్యకాలంలో దానికి వస్తున్న ఇతర అర్ధాలను నేను నమ్మను. హీరోలో కంటెంట్ ఉంటేనే అతను స్టార్‌గా రాణిస్తాడు. నాగత చిత్రం ‘దేవదాస్’ ఫ్లాప్ అయినా నేనేమీ బాధ, భయపడటం లేదు. నాకు ఎలాంటి దిగులు లేదు.గత చిత్రాల తాలూకు ఫ్లాప్స్‌కి నేనేమీ భయపడను. సక్సెస్ కోసం మరింత కష్టపడతాను... అంటూ నిర్మొహమాటంగా, నిజాయితీగా చెప్పుకొచ్చాడు. అందుకే నాని ఈజ్‌గ్రేట్ అనాలనిపిస్తుంది.