Advertisementt

‘సిరివెన్నెల’కు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సపోర్ట్

Sat 20th Apr 2019 02:54 PM
sirivennela,bollywood star director,neeraj pandey,priyamani,sirivennela movie,teaser release  ‘సిరివెన్నెల’కు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సపోర్ట్
Bollywood Star Director Released Sirivennela Teaser ‘సిరివెన్నెల’కు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సపోర్ట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నీరజ్ పాండే చేతుల మీదుగా ప్రియమణి ‘సిరివెన్నెల’ టీజర్ లాంచ్ 

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని... తనదైన విభిన్న పాత్రలతో మెప్పించిన ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించి అభిమానుల్ని సంపాదించుకుంది. పెళ్లి చేసుకొని కొంత గ్యాప్ తీసుకొని... సిరివెన్నెల అనే తెలుగు చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ లోగోకు మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఏ వెడ్ నెస్ డే,  స్పెషల్ చబ్బీస్, బేబీ వంటి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నీరజ్ పాండే సిరివెన్నెల చిత్రం టీజర్ ను లాంచ్ చేయడం విశేషం. ఈ చిత్ర టీజర్ ఆయనకు బాగా నచ్చిందని, ప్రియమణి కెరీర్లో విభిన్నమైన సినిమాగా ఆయన కొనియాడారు. ప్రియమణి పవర్ ఫుల్ లేడీగా కనిపిస్తున్న ఈచిత్రం షూటింగ్ పూర్తయింది. ఏ ఎన్ బి కోర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ బోరా, ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లాసిక్ టైటిల్ ‘సిరివెన్నెల’ అనే పేరు పెట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు... జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... ప్రియమణి  గారు చాలా కథలు విన్నప్పటికీ ‘సిరివెన్నెల’ కథ బాగా నచ్చడం... పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకుంది. ప్రియమణికి పర్ ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉండనుంది. మా బ్యానర్ కు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. సిరివెన్నెల అనే టైటిల్ మా సినిమాకు పర్ ఫెక్ట్ యాప్ట్ టైటిల్. టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుంచి ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ ఫినిష్ చేశాం. శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నీరజ్ పాండే విడుదల చేసిన టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రియమణి నట విశ్వరూపం ఇందులో మరోసారి చూడబోతున్నాం. ఆమె కెరీర్లో డిఫరెంట్ సినిమాగా నిలవనుంది.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం.. అని అన్నారు.

Bollywood Star Director Released Sirivennela Teaser:

Neeraj Pandey Supports Sirivennela Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ