ఎవరైనా ఇద్దరు ప్రాణస్నేహితుల మద్య స్పర్ణలు వస్తే ఇతర స్థార్ధ ప్రయోజనాలు ఆశించకుండా వీలుంటే ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేయాలి. కానీ మనవారిలో అది తక్కువ. విడిపోయిన వారిని శాశ్వతంగా దూరం చేసే ప్రయత్నమే మనవారికి చేతనవుతుంది. దానిని తమకు అనుకూలంగా మార్చుకునే తాపత్రయే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో నిజంగానే 30 ఇయర్స్ పృథ్వీ తన 30ఏళ్ల అనుభవాన్ని రంగరిస్తున్నాడని చెప్పాలి. ఇటీవల తన ప్రాణస్నేహితుడు అలీ మీద రాజమండ్రిలో జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగాయి. కానీ వాటికి అల్‌రెడీ అలీ వీడియో రూపంలో సమాధానం ఇచ్చాడు. దానిని అందరు మర్చిపోతున్న వేళ 30 ఇయర్స్ పృథ్వీ ఆలీ మీద సానుభూతి చూపుతున్న తరహాలో మరోసారి వివాదాన్ని కదిపాడు.
పృథ్వి మాట్లాడుతూ... పవన్‌కళ్యాణ్‌గారు అలీగారికే చాన్స్ ఇస్తారా? మాలాంటి వారికి ఇవ్వరా అని మేం అనుకునే వాళ్లం. షూటింగ్ సమయంలో పవన్, అలీ ఇద్దరు చాలా సేపు మాట్లాడుకునే వారు. మేము మాత్రం పవన్ ఎదురైతే నీ బాంచన్ దొర అన్నట్లు నమస్కారం పెట్టి ఓ మూలన కూర్చొనేవారం. ఎప్పుడైనా ఆయన పిలిస్తేనే వెళ్లి మాట్లాడేవారం. నేను, అలీ, మరికొందరు చెన్నైలో ఎన్నో కష్టాలు పడి పైకి ఎదిగాం. అలీ ఎంతో మందికి ఎన్నో సాయాలు చేశాడు. కానీ వాటిని బయటకు చెప్పుకునేందుకు కూడా అలీ ఇష్టపడడు. అలీ తన తండ్రి పేరు మీద ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నాతో అలీ ఎంతో చనువుగా ఉంటాడు. అందుకే పవన్ ఆ మాటలు మాట్లాడగానే అలీ నాకు ఫోన్ చేశాడు.
అన్నా... ఏంటిది.. ఆయన నాగురించి ఇలా మాట్లాడుతాడని ఊహించలేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన నేను చెప్పిన వ్యక్తికి సీటు ఇచ్చానని అంటున్నాడు. ఆయన నన్ను అడిగి ఎవ్వరికీ సీటు ఇవ్వలేదు. పార్టీ పెట్టినప్పుడుగానీ ఆ తర్వాత కానీ నన్ను జనసేనలో చేరమని ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు మాత్రం నమ్మకం ద్రోహం చేశానంటున్నాడేమిటి? అంటూ అలీ నాతో చెప్పి ఎంతో బాధపడ్డాడు. అలీ కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఎంతో కష్టపడి పైకొచ్చాడు. పవన్ కంటే ముందే అలీ ఇండస్ట్రీకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి అలీ గురించి పవన్ అలా మాట్లాడటం భావ్యం కాదు.. అంటూనే అగ్గికి ఆజ్యం పోశాడని చెప్పాలి.