Advertisementt

‘మజిలీ’ మ్యూజిక్ డైరెక్టర్ పనిపట్టబోతున్నారు

Thu 18th Apr 2019 04:40 PM
majili,gopisundar,sahu garapati,music director,serious,ss thaman  ‘మజిలీ’ మ్యూజిక్ డైరెక్టర్ పనిపట్టబోతున్నారు
Producer Sahu Garapati Serious on Majili Music director ‘మజిలీ’ మ్యూజిక్ డైరెక్టర్ పనిపట్టబోతున్నారు
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత - దివ్యాన్ష కౌశిక్ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా ఏప్రిల్ 5 న విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 30 కోట్లు కొల్లగొట్టిన మజిలీ సినిమాతో నిర్మాత సాహు గారపాటి లాభాలు జేబులో వేసుకున్నాడు. పూర్ణ కేరెక్టర్ లో చైతు, అన్షు కేరెక్టర్ లో దివ్యాన్ష, శ్రావణి గా మధ్యతరగతి భార్య పాత్రలో సమంతల నటనలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికి మజిలీ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉన్నారు అంటే.. సినిమాకొచ్చిన టాక్ అలాంటిది. ఇక తన రెండు సినిమాలు హిట్ అవడంతో దర్శకుడు శివ నిర్వాణ అయితే ఫుల్ హ్యాపీ. అయితే అన్ని సవ్యంగా అందరూ హ్యాపీ మూడ్ లో ఉన్న టైం లో మజిలీ పై ఒక న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హడావిడి చేస్తుంది. 

అదేమిటంటే.. మజిలీ నిర్మాత సాహు గారపాటి మాత్రం మజిలీ మేకింగ్ అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడట. అదేమిటంటే.. మజిలీ సినిమాకి మ్యూజిక్ అందించిన గోపి సుందర్ వలన సాహు గారపాటి ఇబ్బంది పడ్డాడట. మజిలీ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ అయన కేవలం మ్యూజిక్ ఇచ్చి.. నేపధ్య సంగీతానికి హ్యాండ్ ఇవ్వగా.. ఆ టైం లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి థమన్ ని తీసుకున్న విషయం తెలిసిందే. ఇక మజిలీ ఈవెంట్ లోను థమన్ తమకి బాగా హెల్ప్ చేసాడని.. అలాగే మజిలీ ప్రమోషన్స్ లోను నేపధ్య సంగీతం వలన మజిలీ సినిమా వాయిదా పడుతుందని అనుకున్నామని.. కానీ థమన్ సమయానికి రాబట్టి సినిమా సకాలంలో విడుదల చేశామని దర్శకుడు శివ చెప్పాడు. 

తాజాగా గోపిసుందర్ అలా మధ్యలో హ్యాండ్ ఇవ్వడంపై నిర్మాత సాహు గారపాటి గుర్రుగా ఉన్నాడని.. గోపి వలన తానూ నష్టపోతానేమో అనుకున్నానని.. కానీ సమయానికి థమన్ వలన సినిమాని సక్రమంగా విడుదల చేయగలిగామని... గోపి సుందర్ మజిలీ విషయంలో వ్యక్తిగత కారణాలు అడ్డొచ్చాయంటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి విముఖత చూపడంతో.. థమన్ ని తీసుకున్నామని.. ఒకవేళ థమన్ దొరక్కపోతే తమ సినిమా విడుదల కాకపోయేదని... దానితో తాము ఆర్థికంగా నష్టపోయేవాళ్లమని..సన్నిహితుల దగ్గర నిర్మాత వాపోతున్నాడట. అందుకే గోపి సుందర్ మీద ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చెయ్యడానికి నిర్మాత సాహు గారపాటి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది.

Producer Sahu Garapati Serious on Majili Music director:

Majili Producer Reports on gopisundar in Film chamber

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ