Advertisementt

బన్నీ-వేణు శ్రీరామ్ ఐకాన్ కథ కాపీనా..!

Wed 17th Apr 2019 02:11 PM
allu arjun,venu sriram,icon movie,story,copy rumours  బన్నీ-వేణు శ్రీరామ్ ఐకాన్ కథ కాపీనా..!
Copy Rumours on Bunny, Venu Sriram Movie Story బన్నీ-వేణు శ్రీరామ్ ఐకాన్ కథ కాపీనా..!
Advertisement
Ads by CJ

త్రివిక్రమ్ కాకుండా బన్నీ, వేణు శ్రీరామ్ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. వేణు చెప్పిన కథ విన్న బన్నీ వెంటనే చేసేద్దాం అని చెప్పేంత కథలో ఏముందో ఎవరికి అర్ధం కాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాత దిల్ రాజు ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న వార్తలు. ఆల్రెడీ ఈసినిమాకి ఐకాన్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. 

ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో వేణు శ్రీరామ్ రెడీగా ఉన్నాడట. కథ విన్న బన్నీ కదిలిపోయాడని చెబుతున్నారు. అంతలా ఆకట్టుకునే కథ ఏమై ఉంటది అని ఆరా తీస్తే... అది ఒక ఫిలిప్పైన్స్ సినిమా కథ అని తెలుస్తుంది. 2017లో విడుదలయిన ‘కిట కిట’ (KITA KITA) అనే టైటిల్ తో అక్కడ రిలీజ్ అయింది. ఈ కిటకిట అంటే ‘ఐ విల్ సీ యూ’ అనే ఇంగ్లీష్ అర్థం.

ఇందులో ఓ అంధురాలు, తను ఇష్టపడే అబ్బాయి కోసం సాగించే అన్వేషణ. టూరిస్ట్ గైడ్ గా పనిచేసే యువతి తాత్కాలికంగా అంధురాలు కావడం, ఆమె టూరిస్ట్ ప్రదేశాలు అన్నీ తిరుగుతూ అతని కోసం అన్వేషించడం అన్నది లైన్. మరి అదే స్టోరీతో తెలుగులో తీస్తారా? లేదా ఏమన్నా మార్పులు చేసి సినిమా చేస్తారా? అనేది తెలియాల్సిఉంది. అసలు ఇంతకీ ఆ సినిమా రైట్స్ తీసుకున్నారో లేదో కూడా తెలియాలి. ఎందుకంటే ఈమధ్య లైన్స్ ఊరికే వాడుకోవడం అంత ఈజీ కాదని అర్ధం అయిపోయింది. సో ఏం చేస్తారో చూడాలి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Copy Rumours on Bunny, Venu Sriram Movie Story:

Gossips on Icon Movie Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ