Advertisementt

బెల్లంకొండకి కాజల్ బాగా యూజయింది

Wed 17th Apr 2019 01:47 PM
kajal,teja,bellamkonda srinivas,sita movie,pre release business  బెల్లంకొండకి కాజల్ బాగా యూజయింది
Sita Pre Release Business Details బెల్లంకొండకి కాజల్ బాగా యూజయింది
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీనివాస్ అంటే బడా నిర్మాత కొడుకు. కొడుకుని హీరోగా నిలబెట్టడానికి బెల్లంకొండ సురేష్ ఇప్పటికి భారీ బడ్జెట్ పెడుతూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కొడుకు సినిమాలకు ఇతర నిర్మాతలతో... తానొక షాడో నిర్మాతగా ఉండి మరీ.. భారీగా సినిమాలు చేస్తున్న సురేష్.. కొడుకు క్రేజ్ తో వర్కౌట్ కాదని టాప్ హీరోయిన్లని తీసుకొస్తున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తో జోడికట్టిన ఏకైన యావరేజ్ హీరో శ్రీనివాస్. ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. అయినా బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలకు క్రేజ్ ఉంటుంది. కారణం ఆ సినిమాలు చేసే దర్శకులు, హీరోయిన్స్ వలన.

తాజాగా శ్రీనివాస్ నటించిన సీత సినిమా రేపు 25 న విడుదలకాబోతుంది. తేజ దర్హకత్వంలో కాజల్ మెయిన్ లీడ్ లో శ్రీనివాస్ నటించిన సీత సినిమాపై ట్రేడ్ లో ఆసక్తి ఉంది. కారణం నేనే రాజు నేనే మంత్రి హిట్ తో తేజ, కాజల్ క్రేజ్. అందుకే సీత సినిమా  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఏకంగా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది సీత సినిమా. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటే.. రిచ్ నెస్, హిట్ డైరెక్టర్, టాప్ హీరోయిన్ ఉంటాయి. అందుకే శ్రీనివాస్ సినిమాలకు క్రేజెక్కువ.

ఇక ట్రేడ్ లో సీత సినిమా మీద క్రేజ్ రావడానికి కారణం కాజల్ అండ్ తేజ లే. శ్రీనివాస్ గత చిత్రాలతో పనిలేకుండా ఈ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరగడానికి దర్శకుడు హీరోయిన్ మాత్రమే కారణం. మరి శ్రీనివాస్ ఇంకెన్నాళ్లు దర్శకుడు, హీరోయిన్ మీద బతికేస్తాడో?

Sita Pre Release Business Details:

Kajal, Teja Effect on Bellamkonda Srinivas Sita

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ