Advertisementt

‘ఎర్రచీర’ మొదలైంది

Wed 17th Apr 2019 12:42 PM
erra chira,movie,opening,details  ‘ఎర్రచీర’ మొదలైంది
Erra Chira Movie Shooting Starts ‘ఎర్రచీర’ మొదలైంది
Advertisement
Ads by CJ

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై సిహెచ్‌. సుమన్‌ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. ఈ చిత్రం సోమవారంనాడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుమన్‌ బాబు, కారుణ్య, కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేశ్ నటీనటులుగా నటిస్తుండగా ‘మహానటి’ ఫేమ్‌ బేబీ తుషిత ప్రధాన పాత్ర పోషిస్తోంది.

దర్శక నిర్మాత చెరువుపల్లి సుమన్‌ మాట్లాడుతూ... నేను కుటుంబ బాంధవ్యాలకు, అనురాగాలకు ఎంతో విలువ ఇస్తాను. నా భావాలకు అనుగుణంగానే సంపూర్ణ కుటుంబ కథాచిత్రాన్ని నిర్మిస్తున్నాను. కమర్షియల్‌ హంగులతో కూడా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

పూజా కార్యక్రమాల అనంతరం రచయిత గోపీ (విమలపుత్ర) డైరెక్టర్‌ సుమన్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ చిత్రంలో మనుషుల మధ్య భావోద్వేగాలు ఎంత పెనవేసుకొని వుంటాయో అనే అంశాలను చెబుతూనే హర్రర్‌, థ్రిల్లింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలు కూడా జోడించామని రచయిత తెలిపారు. 

రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తామనీ, ప్రమోద్‌ పులిగ్లి అందించిన స్వరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాత వెల్లడించారు.

Erra Chira Movie Shooting Starts:

Erra Chira Movie Opening Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ