Advertisementt

‘జెర్సీ’ ఓవర్సీస్ రైట్స్ ఎంతో తెలుసా?

Tue 16th Apr 2019 03:25 PM
hero nani,jersey,overseas,business,4 crore  ‘జెర్సీ’ ఓవర్సీస్ రైట్స్ ఎంతో తెలుసా?
Shocking Overseas Business to Jersey ‘జెర్సీ’ ఓవర్సీస్ రైట్స్ ఎంతో తెలుసా?
Advertisement
Ads by CJ

గత రెండు వారాలుగా థియేటర్స్ అన్ని కళలాడుతున్నాయి. మజిలీ సినిమాతో బాక్సాఫీసు బోర్ ని దూరం చేసిన సమంత - నాగ చైతన్యలు మజిలీ సినిమాతో వారూ హిట్ అందుకున్నారు. ఇక గత శుక్రవారం చిత్రలహరి సినిమా కూడా యావరేజ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచుతుంది. సాయి తేజ్ - కిషోర్ తిరుమల కాంబోలో వచ్చిన ఈ సినిమాకి టాక్ యావరేజే పడింది కానీ.. ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ సాధించి సినిమా హిట్ కళ ఉందని చెబుతుంది. ఇక ఈ రెండు వారాలు ప్రేక్షకులు బోర్ ని దూరం చేస్తే... ఇక మూడో వారంలో నాని జెర్సీ బాక్సాఫీసు బరిలోకి దిగుతుంది.

ప్రస్తుతం ప్రమోషన్స్ తో జెర్సీ సినిమా మీద క్రేజ్ బాగా పెరిగింది. అందులో నేచురల్ స్టార్ నాని సినిమా అంటే ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి ఉంటుంది. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన జెర్సీ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలతోనే ఈ జెర్సీ నాని గత చిత్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక అన్నిటికి మించి నాని జెర్సీ ఓవర్సీస్ హక్కులు 4కోట్లకు అమ్ముడైయ్యాయని.... లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.

నేచురల్ స్టార్ గా నానికి యూఎస్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే మార్కెట్ వ్యాల్యూ కూడా బావున్నప్పటికీ... నాని రెండు గత చిత్రాల ప్లాప్స్ తో ఓవర్సీస్ మార్కెట్ కాస్త డల్ అయినా.. తాజాగా జెర్సీకి 4 కోట్లు రావడం అనేది కాస్త షాకింగ్. అయినా జెర్సీ టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతోనే ఓవర్సీస్ లో జెర్సీకి అంత మంచి రేటొచ్చిందని అంటున్నారు.

Shocking Overseas Business to Jersey:

4 Crore Overseas Business to Jersey

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ