Advertisementt

నవీన్ చంద్ర కొత్త సినిమాకు క్లాప్ కొట్టారు

Tue 16th Apr 2019 02:50 PM
naveen chandra,venu madikonda,new movie,launch,details  నవీన్ చంద్ర కొత్త సినిమాకు క్లాప్ కొట్టారు
Naveen Chandra New Movie Launched నవీన్ చంద్ర కొత్త సినిమాకు క్లాప్ కొట్టారు
Advertisement
Ads by CJ

హీరోగా తనదైన ముద్రను వేసిన నవీన్ చంద్ర  కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది.  పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో జరిగింది. దర్శకుడు సుధీర్ వర్మ క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు కృష్ణ చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గౌరవ దర్శకత్వం దర్శకుడు అనీల్ కృష్ణ వహించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ : దర్శకుడు వేణు మదుకంటి : వెంకటాపురంకి దర్శకుడుగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మంచి స్క్రిప్ట్ కోసం టైం తీసుకున్నాం. నిర్మాత మంజునాథ్ గారుతో కలసి సంవత్సరం నుండి ఈ కథపై పనిచేశాము. ఇప్పటి వరకూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానీ కథ, కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది. నిర్మాత మంజునాథ్ గారు మంచి సినిమాతో తెలుగు పరిశ్రమలో కి రాబోతున్నారనే నమ్మకం మాకుంది. వైజాగ్ నేపథ్యంలో జరిగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో చివరి నిముషం వరకూ ప్రేక్షకుల ఊహకందని మలుపులుంటాయి. ఈ స్క్రీన్ ప్లై బేస్డ్ మూవీ రెలాస్ట్రిక్ ఇన్సిడెంట్స్ లేవు. చివరి వరకూ ఎవరూ ఊహించని మలుపులతో కథ నడుస్తుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్స్ లో ఇప్పటి వరకూ చూసిన  నవీన్ చంద్రను కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాను. నవీన్ చంద్ర ఇప్పటి వరకూ చేయని రోల్ లో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది.

నిర్మాత మంజునాథ్ : యశాస్ సినిమాస్ బ్యానర్ లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ని ప్లాన్ చేస్తున్నాం. వేణు ఐడియా నచ్చి కథపై వర్క్ చేసాం. తప్పకుండా ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది.

హీరో నవీన్ చంద్ర : నా కెరియర్ లో బాల్ రెడ్డి పాత్ర పెద్ద మలుపుగా అనుకోవచ్చు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత చాలా మంచి పాత్రలు చేస్తున్నా. త్రివిక్రమ్ గారికి, ఎన్టీఆర్ గారికి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఈ కథ కూడా అన్ని రకాల ప్రేక్షకులకు ఒక విభిన్నమయిన సినిమా ఇవ్వ బోతున్నాము. కొన్ని సినిమాలు చేస్తున్నా, కథను నమ్మే ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. ఈ బ్యానర్ కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు ముందు ఉంటుంది. మరో వంద సినిమాలు ఈ బ్యానర్ నుండి రావాలని కోరుకుంటున్నాను. మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి.

బ్యానర్ : యశాస్ సినిమాస్

హీరో : నవీన్ చంద్ర

ప్రధాన పాత్రలు : కోట శ్రీ నివాసరావు, నాజర్, రావు రమేష్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాసరావు, మొట్ట రాజేంద్రన్, జోగినాయుడు, ఆర్ ఎక్స్ 100 విజయ్

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్

మ్యూజిక్ : అచ్చు

ఎడిటర్ : బొంతల నాగేశ్వర రెడ్డి

ప్రొడక్షన్  డిజైనర్ : అంథోనీ

పొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : పి. నానాజీ నాయుడు

కాస్టింగ్ డైరెక్టర్ : శ్రీకాంత్

పి ఆర్వో : జి.యస్.కె. మీడియా

స్టిల్స్ : వరహాల మూర్తి

ప్రొడ్యూసర్ : వి. మంజునాథ్.

స్టోరి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వేణు మదికంటి.

Naveen Chandra New Movie Launched:

Naveen Chandra and Venu Madikonda Film Launch Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ