హార్రర్ కామెడీ జోనర్స్ కు మన దగ్గర కొంచెంకొంచెంగా గ్రాఫ్ తగ్గిపోయింది. ఈ జోనర్ పై జనాలు విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎక్కువ శాతం ఈ జోనర్ వదిలేసి వేరే జోనర్స్ పై పడ్డారు. అయినా కానీ కొన్ని సినిమాలు వస్తున్నాయి. కానీ తుస్సుమంటున్నాయి. అటువంటి ఈ రోజుల్లో రాఘవ లారెన్స్ ‘గంగ’తో సక్సెస్ సాధించగలిగాడు.
ఇప్పుడతను దాని సీక్వెల్ గా కాంచన 3 ను రూపొందించాడు. గంగ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది. లారెన్స్ కామెడీ ప్లస్ హార్రర్ జోనర్స్ తీయడంలో ఎక్స్పర్ట్. అతనికి ముఖ్యంగా మాస్ పల్స్ తెలిసి ఉండటం అతడికి కలిసొచ్చింది. ఇప్పుడొచ్చే కాంచన 3 పై కూడా అంచనాలు ఉన్నాయి. ఐతే దీని ట్రైలర్ చూస్తే లారెన్స్ ఏమీ కొత్తగా చూపించేలా కనిపించడం లేదు.
అసలే కామెడీ జోనర్స్ పై విసిగెత్తిపోయిన జనాలకు మళ్లీ రొటీన్ సినిమా అంటే కచ్చితంగా తిరస్కరిస్తారు. లారెన్స్ ఏదైనా ఎక్స్‌ట్రీమ్‌గా చూపిస్తే తప్ప. కొత్తదనం లేకుంటే సినిమాల్ని ఆదరించడం లేదు. తాజాగా ‘ప్రేమకథా చిత్రమ్-2’ అనే హార్రర్ కామెడీ తెలుగులో డిజాస్టర్ అయింది. ఒకవేళ లారెన్స్ కాంచన 3 ఫెయిల్ అయితే తెలుగులో ఇంక హార్రర్ కామెడీ అనే జోనర్ అదృశ్యం కావడం ఖాయం. చూద్దాం ఈనెల 19 న రిలీజ్ అవుతున్న ఈసినిమా ఏం చేస్తుందో..