ఇటీవల వరుసగా శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి వంటి చిత్రాలతో ఇబ్బందులు పడుతున్న అక్కినేని వారి పెద్దబ్బాయ్ నాగచైతన్యకి మజిలీ మంచి ఊపునిచ్చింది. ఇందులో నాగచైతన్యతో పాటు ఆయన శ్రీమతి సమంత నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ వరుస పరాజయాల్లో ఉన్న చైతులో మరలా జోష్ నింపింది. లాంగ్‌రన్‌లో ఈ మూవీ చైతు కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. శివనిర్వాణ ఫీల్‌గుడ్ టేకింగ్, నాగచైతన్య, సమంతల ఎమోషనల్ నటన, థమన్ బీజీఎం వంటివి ఈ చిత్రాన్ని స్ట్రాంగ్‌గా నిలబెడుతున్నాయి. దీనితో పాటు ప్రస్తుతం నాగచైతన్య బాబి దర్శకత్వంలో తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది.
ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన రాజు గారి గది2, ఆఫీసర్, దేవదాస్‌లతో డీలాపడ్డాడు. ఇప్పుడు మరలా వరస చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాడు. నాగార్జున కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘మన్మథుడు 2’లో ఆయన బిజీబిజీగా ఉన్నాడు. మరోవైపు తనకి అద్భుతమైన విజయం అందించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ ‘బంగార్రాజు’కి కూడా నాగ్ ఓకే చెప్పాడు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణనే ఈ మూవీకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే నాగచైతన్య ఇందులో నటించడం లేదని, ఆయన పాత్రలో ఆయన తమ్ముడు అఖిల్ నటిస్తున్నాడని వార్తలు రావడంతో గందరగోళం ఏర్పడింది.
ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. స్వయానా నాగచైతన్యనే ఈ క్లారిటీ ఇచ్చాడు. ‘బంగార్రాజు’ చిత్రంలో తాను కూడా నటిస్తున్నానని, ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్ జరుగుతోందని తెలిపాడు. హీరోయిన్లను త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు. దీంతో నాగార్జునతో నాగచైతన్య నటించడం ఖాయమైంది. మరి ఇందులో అఖిల్ కూడా నటిస్తాడా? అనే విషయంలో క్లారిటీ లేదు. చేసినా కూడా అది కేవలం కామియో తరహాలో ఉంటుందే గానీ కీలకమైన పాత్ర మాత్రం కాదని తెలుస్తోంది. మొత్తానికి చైతు దాదాపు ఒకే సమయంలో ఇటు తన మేనమామ వెంకటేష్‌తో ‘వెంకీ మామా’, తండ్రితో కలిసి ‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’లు వరుసగా చేస్తూ ఉండటం విశేషమనే చెప్పాలి.