దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్- ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం RRR షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయం అవ్వడం కారణంగా మూడు వారాల పాటు బ్రేక్ ఇచ్చారు. ఇక ఇందులో ఎన్టీఆర్ సరసన నటించించాల్సి వచ్చిన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ కొన్ని కారణాలు వల్ల ఈసినిమా నుండి తప్పుకుంది.
ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఆ హీరోయిన్ ని ఫైనల్ చేయనున్నాడు. కాగా RRR లో నిత్య మీనన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే నిత్య మీనన్ ఇందులో సెకండ్ హీరోయిన్ అంట.
అలానే ఇప్పటికే ఇందులో ఫైనల్ అయిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. తమిళ డైరెక్టర్ మరియు నటుడు సముద్రఖని కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అలియా రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమా 2020 లో రిలీజ్ కానుంది.