మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్.. ‘ధృవ’ నుంచి ఈయన రూట్ మార్చాడు. అంతకు ముందు వరుస డిజాస్టర్స్‌తో ఇబ్బంది పడ్డ రామ్‌చరణ్ తమిళ ‘తన్నీవరువన్’కి రీమేక్‌గా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ధృవ చిత్రం చేశాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నిజానికి పెద్దనోట్ల రద్దు సమయంలో వచ్చింది కాబట్టి కలెక్షన్లు కాస్త తగ్గాయి గానీ లేకపోతే ఈ చిత్రం కూడా ఇంకా మంచి విజయం సాధించి ఉండేది. ఇక ఆ తర్వాత ఎందరో వద్దని వారించినా సుకుమార్‌తో రంగస్థలం వంటి విభిన్న చిత్రం చేశాడు. ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. తన తండ్రి ఖైదీనెంబర్ 150 పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది.
కానీ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన వినయ విధేయ రామ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంపై జరిగిన ట్రోలింగ్, బోయపాటి, చరణ్‌ల మీద వచ్చిన విమర్శలు అన్ని ఇన్ని కావు. కాగా ప్రస్తుతం రామ్‌చరణ్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే అసలుసిసలు మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. అంటే ఆర్‌ఆర్‌ఆర్ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అరవింద సమేత వీరరాఘవ చిత్రంతో విజయం సాధిస్తే రామ్‌చరణ్ వినయ విధేయ రామతో దెబ్బతిన్నాడు. ఇక రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం 2020 జులై 30న విడుదల కానుంది. దీని తర్వాత చరణ్ చేయబోయే చిత్రం ఎవరి దర్శకత్వంలో అనే ఆసక్తికర చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం గతంలో రామ్‌చరణ్-అల్లుఅర్జున్-దిల్‌రాజుల కాంబినేషన్‌లో వచ్చిన ఎవడు వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన వంశీపైడిపల్లి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం.
ఆర్‌ఆర్‌ఆర్‌కి సంబంధించి తన పార్ట్ షూటింగ్ పూర్తి కాగానే వంశీపైడిపల్లి చిత్రం పట్టాలెక్కనుందట. ప్రస్తుతం వంశీ పైడిపల్లి, మహేష్‌బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం అయిన మహర్షిని డైరెక్ట్ చేస్తున్నాడు. మే9న ఈ చిత్రం విడుదలైన వెంటనే చరణ్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌పై కూర్చోనున్నాడని సమాచారం. మొత్తానికి మున్నా, బృందావనం, ఎవడు. ఊపిరి, మహర్షి చిత్రాల తర్వాత వంశీపైడిపల్లి చేయబోయే తదుపరి చిత్రం రామ్‌చరణ్‌తోనే అని తెలుస్తోంది.