టాలీవుడ్ పరిశ్రమ సత్తాని దేశవిదేశాలలో చాటిన ఘనత బాహుబలి సిరీస్‌కి దక్కుతుంది. ఇక కన్నడ సినిమా సత్తాని, శాండల్‌వుడ్ స్టామినాని కేజీఎఫ్ చిత్రం చాటి చెప్పింది. కన్నడ చిత్రాలంటే ఎప్పుడో అవుట్‌డేటెడ్ అయిన సినిమాలని, వాటి మార్కెట్ పరిధి అత్యంత తక్కువని భావిస్తున్న తరుణంలో కన్నడలో ఏ హీరో సాధించలేని ఘనతను యష్ సాధించాడు. ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్‌లో, పాకిస్థాన్‌లో కూడా దుమ్ము రేపింది. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తనయుల వంటి వారికి కూడా సాధ్యం కాని ఫీటుని ఈ చిత్రంతో యష్ సాధించాడు. ఇక ఈ చిత్రం తర్వాత దీని దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడ పరిశ్రమ కీర్తిపతాకాన్ని దశదిశలా చాటాడు.
కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో బిజీగా ఉన్నాడు. మొదటి పార్ట్‌లో నటించడానికి ఒప్పుకోని సంజయ్‌దత్ నుంచి ఎన్నో భాషల స్టార్స్ ఈ చాప్టర్2లో చేయనున్నారు. ఇక ప్రశాంత్ నీల్ తెలుగులోకి కూడా తెరంగేట్రం చేసే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో నటించడానికి పలువురు హీరోలు, ఆయనతో సినిమా తీసేందుకు పలువురు టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థలు ఎదురు చూపులు చూస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రెండు నిర్మాణ సంస్థల పేరు బలంగా వినిపిస్తోంది.
అందులో ఒకరు దిల్‌రాజు కాగా, రెండోది యువి క్రియేషన్స్ బేనర్. దిల్‌రాజు ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం చేయడానికి మంతనాలు జరుపుతున్నాడట. మరోవైపు ‘సాహో’తో పాటు జిల్‌రాధాకృష్ణ చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉన్న యువి క్రియేషన్స్ అధినేతలు కూడా తమ బేనర్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇక మహేష్, ప్రభాస్‌ల కాల్షీట్స్ ప్రస్తుతానికి రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రశాంత్ కూడా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో బిజీగా ఉన్నాడు. మరి దిల్‌రాజు-మహేష్, యువిక్రియేషన్స్-ప్రభాస్‌లలో ఎవరి చిత్రానికి ప్రశాంత్ ఓకే చెప్పినా అది పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయం పడుతుందనేది వాస్తవం.