Advertisementt

చైతూ, సమంతలపై ఒత్తిడి ఎక్కువైంది..!

Sun 14th Apr 2019 12:31 PM
nagachaitanya,samantha,hit pair,majili movie,another film  చైతూ, సమంతలపై ఒత్తిడి ఎక్కువైంది..!
Naga Chaitanya, Samantha In Another Film చైతూ, సమంతలపై ఒత్తిడి ఎక్కువైంది..!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంతలు పెళ్లికి ముందు ఏమాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఏమాయ చేసావే, మనం సినిమాలు సూపర్ హిట్స్. ఆటో నగర్ సూర్య అట్టర్ ప్లాప్. ఇక పెళ్లి తర్వాత ఈ జంట రీసెంట్ గా మజిలీ సినిమాతో ప్రేక్షకులను మాయ చేశారు. మజిలీ సినిమాలో మధ్యతరగతి జీవితంలో భార్యాభర్తలుగా అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఇష్టం లేని భార్యతో సర్దుకుపోలేక.. ఇష్టమైన ప్రియురాలు దక్కక మానసిక సంఘర్షణతో నలిగిపోతూ.. భార్య ప్రేమను అర్ధం చేసుకోలేని యువకుడిగా నాగ చైతన్య బెస్ట్ పెరఫార్మెన్స్ ఇవ్వడమే కాదు... చైతుకి మూడు చిత్రాల తర్వాత మజిలీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సమంత మజిలీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

అయితే చైతు - సమంతల జంట మళ్ళీ మళ్ళీ కలిసి నటించాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. సమంతది, చైతుది హిట్ ఫెయిర్ అని... మళ్ళీ మళ్ళీ కలిసి వీళ్ళు సినిమాలు చెయ్యాలని కోరుతున్నారు. మరి నాగ చైతన్య ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ లో బిజీగా ఉంటే... సమంత మాత్రం ఓ బేబీ సినిమాతో పాటుగా.. 96 రీమేక్ అలాగే తమిళ సినిమాలతో బాగా బిజీ. మరి నాగ చైతన్య - సమంతలు కలిసి మళ్ళీ నటించాలంటే మరో దర్శకుడు మరో మంచి కథతో ఈ జంటని మెప్పించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ జంట మళ్ళీ కలిసి నటించాలంటే రెండేళ్లు ఆగాల్సిందే మరి.

Naga Chaitanya, Samantha In Another Film:

Chai-Sams For More Magic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ