Advertisementt

ఆర్‌ఆర్‌ఆర్ లో ఎన్టీఆర్ హీరోయిన్ ఈమేనా?

Sat 13th Apr 2019 11:34 AM
nithya menon,pairup,ntr,rrr movie,rajamouli  ఆర్‌ఆర్‌ఆర్ లో ఎన్టీఆర్ హీరోయిన్ ఈమేనా?
Nithya Menon Pairup With NTR In RRR Movie ఆర్‌ఆర్‌ఆర్ లో ఎన్టీఆర్ హీరోయిన్ ఈమేనా?
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న RRR మూవీలో రామ్ చరణ్ అల్లూరు సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపిస్తున్నారు. ఇక అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ కి, సీతగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్జర్ జోన్స్ నటించాల్సి ఉండగా... ఆమె అనుకోకుండా RRR నుండి తప్పుకోవడంతో.. ఇప్పుడు కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం రాజమౌళి మళ్ళీ సెర్చ్ చెయ్యాల్సిన పరిస్థితి. అయితే రాజమౌళి మదిలో బాలీవుడ్ భామలైన శ్రద్ద కపూర్, పరిణీతి చోప్రా, జాన్వీ కపూర్ లు ఉన్నారనే టాక్ వినబడినా.. తాజాగా రాజమౌళి మరో సౌత్ హీరోయిన్ నే ఎన్టీఆర్ కోసం తీసుకురాబోతున్నాడనే న్యూస్ వినబడుతుంది.

అది కూడా గ్లామర్ పరంగా, అందాల ఆరబోత పరంగా పద్దతిగా ఉండే హీరోయిన్, కానీ నటనలో మాత్రం అదుర్స్ అన్న రేంజ్ నటించే నిత్య మీనన్ ని RRR సినిమాలో కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ సరసన తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. ఎందుకంటే నిత్య లేటెస్ట్ మూవీ ప్రాణ సినిమా చూసిన రాజమౌళి.. ఆ సినిమాలో నిత్య మీనన్ సూపర్ పెర్ఫామెన్స్ చూసి ఆమెని అప్రోచ్ అయ్యారని... ఇప్పటికే హైదరాబాద్‌కి పిలిపించి స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని తెలుస్తోంది.. మరి నటనలో సహజత్వానికి పెద్ద పీట వేసే నిత్య నిజంగా RRR లో గనక సెలెక్ట్ అయితే ఆమెకి అదృష్టం వరించినట్లే.  అయితే రాజమౌళి మాత్రం ఎన్టీఆర్ కి ఈ సౌత్ భామ నిత్యానే ఫైనల్ చేసేటట్లుగా ఉన్నాడనే టాక్ మాత్రం బాగా వినబడుతుంది.

Nithya Menon Pairup With NTR In RRR Movie:

Rajamouli RRR Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ