వినయ విధేయరామ సినిమా ప్లాప్ తో ఎవ్వరికి కనబడకుండా.. అమరావతిలో తేలిన దర్శకుడు బోయపాటి.. అక్కడ 2019 ఎన్నికల నేపథ్యంలో టిడిపి తరుపున యాడ్స్ డైరెక్ట్ చేస్తూ టిడిపి సేవలో తరించాడు. దాదాపుగా వినయ విధేయరామ తర్వాత ఓ నెల రోజులు అజ్ఞాతవాసం చేసిన బోయపాటి తర్వాత అమరావతికి వెళ్లి చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి విజయం సాధించడానికి ఏపీలో టిడిపి ప్రభుత్వం చేసిన మంచి పనులను యాడ్స్ రూపంలో తెరకెక్కించాడు. మరి బోయపాటి కేవలం నెలన్నర కాలంలో టిడిపికి చాలానే యాడ్స్ చేసిపెట్టాడు.
మరి ఈ నెలన్నరలో అన్ని యాడ్స్ ని తన టీంతో సక్సె ఫుల్ గా తెరకెక్కించిన బోయపాటికి టిడిపి వారు అక్షరాలా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈరోజు ఎన్నికల్లో టిడిపికి ఎన్ని ఓట్లు పడతాయో కానీ.. బోయపాటి మాత్రం తన శక్తి మేర టిడిపి ప్రభుత్వానికి మేలు జరిగేలా యాడ్స్ చేసాడు. మళ్ళీ ఏపీలో టిడిపి ప్రభుత్వం వస్తుందో లేదో అనేది మే 23 వరకు తెలియదు. మే 23 వరకు కౌంటింగ్ లేని కారణంగా ఇప్పుడే ఫలితాలు చెప్పలేం. మరి ఈ ఎన్నికల వేళ బోయపాటికి నెలన్నర టైంలోనే బాగానే గిట్టుబాటైంది. ఒక ఏడాది కష్టపడి సినిమా తీస్తే 10 కోట్లు వస్తున్న బోయపాటికి ఈ యాడ్స్ పారితోషకం మాత్రం ఇంట్రెస్టింగ్ అనేలా వుంది.