Advertisementt

విజయ్ డామినేషన్ ఎక్కువైందట!

Thu 11th Apr 2019 05:32 PM
dear comrade,vijay deverakonda,involvement,mythri movie makers  విజయ్ డామినేషన్ ఎక్కువైందట!
Vijay Deverakonda Involvement in Dear Comrade విజయ్ డామినేషన్ ఎక్కువైందట!
Advertisement
Ads by CJ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా హిట్స్ తో విజయ్ దేవరకొండ రేంజ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అటు హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. ఇటు బిజినెస్ లోను దూసుకుపోతున్నాడు. సినిమాల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. గీత గోవిందం, టాక్సీవాలా మధ్యలో నోటా సినిమా దెబ్బకి విజయ్ కి అతి జాగ్రత్త ఎక్కువైందని న్యూస్ ఎప్పటినుండో వినబడుతూనే ఉంది. ఇక విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ లోను విజయ్ చేతులు పెట్టాడనే న్యూస్ ఉంది. అయితే విజయ్ స్టార్ డం దృష్టిలో ఉంచుకుని.. మైత్రి మూవీస్ వారు, దర్శకుడు సర్దుకుపోతున్నారనే ప్రచారము జరిగింది.

అయితే నిజంగానే డియర్ కామ్రేడ్ విషయంలో విజయ్ దేవరకొండ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. పర్ఫెక్ట్ ప్రమోషన్స్ కి, అలాగే సినిమా మేకింగ్ లోని పెరిఫెక్షన్స్ కి విజయ్ అతిగా జోక్యం చేసుకుంటున్నాడట. ఇక సినిమా మీద క్రేజ్ ఎలా పెంచాలో తనకి తెలుసనీ.. నిర్మాతలకు దర్శకుడికి విజయ్ చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నాడట. మొన్నటికి మొన్న టీజర్ కటింగ్ లో విజయ్ ఇన్వాల్మెంట్ గురించి వార్తలొచ్చాయి. ముందు చిత్ర బృందం అనుకున్న టీజర్ ని కాకుండా విజయ్ చెప్పింది కట్ చేసి వదిలితే డియర్ కామ్రేడ్ టీజర్ కి ఎలాంటి స్పందన వచ్చిందో చూసాం.

ఇక విజయ్ దేవరకొండ చెప్పినట్లుగానే డియర్ కామ్రేడ్ సింగిల్స్ ని చిత్ర బృందం వదులుతుందట. మరి విజయ్ ఎలా చెబితే అలానే అన్నట్టుగా ఉందట అక్కడి వ్యవహారం. ఇక నోటా లాగే డియర్ కామ్రేడ్ విషయంలో ఎక్కడా తేడా రాకూడదనే విజయ్ ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అలాగే సినిమా ప్రమోషన్స్ బావుంటే..ఆటొమాటిక్ గా సినిమాకి హైప్ పెరుగుతుందని.. అందుకే తనదైన స్టయిల్లో డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ ని విజయ్ సోషల్ మీడియా ద్వారా అందరికి సినిమా మీద ఆసక్తి కలిగేలా చేస్తున్నాడట. మరి హిట్ హీరో ఎలా చెబితే దర్శకనిర్మాతలాగే వినాలి.

Vijay Deverakonda Involvement in Dear Comrade :

Dear Comrade Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ