Advertisementt

మోహన్‌బాబుకు వైవీఎస్ మరోసారి నోటీసులు

Wed 10th Apr 2019 06:16 PM
yvs chowdary,manchu mohan babu,legal notice  మోహన్‌బాబుకు వైవీఎస్ మరోసారి నోటీసులు
YVS Chowdary sends Legal Notice to Mohan Babu మోహన్‌బాబుకు వైవీఎస్ మరోసారి నోటీసులు
Advertisement
Ads by CJ

మీడియా మిత్రులందరికీ నమస్కారం... 

వై.వి.ఎస్‌. చౌదరి అను నేను శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై శ్రీ యం. మోహన్‌బాబు నిర్మించిన, ‘సలీమ్‌’ (2009) చలన చిత్రం యొక్క దర్శకత్వపు బాధ్యతలను నిర్వర్తించినందుకుగాను, రెమ్యూనరేషన్‌ నిమిత్తం శ్రీ యం. మోహన్‌బాబు నాకు బాకీ పడ్డ రూ. 40,50,000 చెక్‌ విషయమై, నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దాదాపు 9 సంవత్సరాల అనంతరం ‘23వ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు’ ఎర్రమంజిల్‌, హైదరాబాద్‌లో 2 ఏప్రిల్‌ 2019న నాకు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయం అందరికీ తెల్సినదే. ఈ నేపథ్యంలో శ్రీ యం. మోహన్‌బాబు నేను సదరు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినట్లుగా ఇటీవల పత్రికా ప్రకటన విడుదల చేయడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 

అంతేకాకుండా ‘సలీమ్‌’ చిత్ర నిర్మాణ సమయంలో ఇప్పుడు శ్రీ యం. మోహన్‌బాబు హైదరాబాద్‌ జల్‌పల్లి గ్రామంలో నివసిస్తున్న ఇంటిని ఆనుకొని, నా ఇంటి నిర్మాణానికై నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి, చెక్‌ బౌన్స్‌ కేసు కోర్టు తీర్పు అనంతరం నన్ను, నా మనుషుల్ని రానీయకుండా అడ్డుకోవడం, ఆటంకాలు కల్పించడం తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది. నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా ఇంటి స్థలం విషయంలో ఆయన సమస్యలు సృష్టిస్తుండటంతో, ఇన్నేళ్లగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం న్యాయనిపుణులను ఆశ్రయించడమైనది. పూర్తి వివరాలకై మా న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్‌ నోటీసును ఈ లేఖతో జతచేయడమైనది, గమనించగలరు. 

ఎల్లప్పుడూ మీ సహాయసహకారాలను కాంక్షించే 

మీ 

వై.వి.ఎస్‌. చౌదరి 

సినీ దర్శక-నిర్మాత

YVS Chowdary sends Legal Notice to Mohan Babu:

YVS Chowdary vs Manchu mohan babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ