Advertisementt

సమంత కోసం క్యూ కడుతున్నారు

Wed 10th Apr 2019 04:57 PM
samantha,majili movie,success,directors,que  సమంత కోసం క్యూ కడుతున్నారు
Samantha Gets One More hit With Majili సమంత కోసం క్యూ కడుతున్నారు
Advertisement
Ads by CJ

పెళ్ళికి ముందు అటు ఇటుగా ప్లాప్స్ వచ్చినా.. పెళ్లి తర్వాత కెరీర్ లో అవకాశాలు రావనుకుంటే.. దానికి పూర్తి విరుద్ధంగా సమంత కెరీర్ ఉంది. నాగ చైతన్యతో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత సమంతతో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు భయపడ్డారు. అక్కినేని ఇంటి కోడలుగా వెళ్లిన సమంతతో సినిమాలు చేసే ధైర్యం ఎవరూ చెయ్యలేదు. ఇక సమంత పెళ్లి తర్వాత కెరీర్ క్లోజ్ అన్నవారికి సమంత తాజా ఆఫర్స్ చూస్తుంటే దిమ్మతిరిగిపోద్ది. పెళ్లి తర్వాత సమంత గ్లామర్ పాత్రలకు రొమాంటిక్ సినిమాలకు దూరమైన మాట వాస్తవమే. కానీ నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ సమంత పెళ్లి తర్వాత కెరీర్ లో ఒక వెలుగు వెలుగుతుంది. మంచి సినిమాలను, తనకు నచ్చిన పాత్రలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ.. సమంత కెరీర్ ని మలచుకుంటుంది.

పెళ్లి తర్వాత నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తున్న హద్దులు దాటడం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలతో సర్దుకుపోతూ లిప్ కిస్ లకు, అందాల ఆరబోతకు ఒప్పుకోవడం లేదు. తాజాగా మజిలీలో సమంత పాత్ర చూస్తే ఆమె నటనలో పరిపూర్ణత తెలుస్తుంది. శ్రావణి పాత్రలో సమంత నటించలేదు. జీవించింది. బయట భార్య భర్తలుగా చైతు - సామ్ లు ఎలా ఉంటారో తెలియదు కానీ.. మజిలీ సినిమాలో ఈ జంట ఆ మధ్యన రొమాంటిక్ సీన్స్ లేకపోయినా.. అందులో ఉండే అందమైన సంఘర్షణ అర్ధమవుతుంది. అయితే మజిలీ తర్వాత ఓ బేబీ, 96 రీమేక్ చేస్తున్న సమంత కోసం ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారట. సమంతతో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చెయ్యడానికి... ఆసక్తి చూపుతున్నారట. మరి అక్కినేని కోడలికి అవకాశాలు రావేమో అనేవారికి.. ఇప్పుడు సమంత డైరీ చూస్తే అర్ధమవుతుంది. వచ్చే రెండేళ్లపాటు సమంత డైరీ ఫుల్. 

Samantha Gets One More hit With Majili:

Directors Que for Samantha With Her Success

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ