ప్రముఖ కమెడియన్ అలీ వైసిపిలో చేరిన తర్వాత నా దగ్గర బలం లేదని అలీ వైసిపిలో చేరాడని చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఉన్నట్టుండి రాజమండ్రిలో అలీ మీద సంచలన కామెంట్స్ చేసాడు. రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్.. అలీ తనని వెన్నుపోటు పొడిచాడని... అలీ కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడ్డా అని అన్నాడు. అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ భక్తుడైన అలీ జనసేనలో చేరుతాడనుకున్న వారికీ.. ఝలక్ ఇచ్చి టిడిపిలో చేరుతున్నట్లుగా డ్రామాలాడి.... చివరికి వైసిపిలో చేరిన విషయం తెలిసిందే అయితే పవన్ తనపై చేసిన వాక్యాలు చూసిన అలీ ఒక వీడియో ద్వారా తన స్పందనను తెలియజేశాడు.
ఇప్పుడు పవన్ గురించి అలీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారికి నేనేంటో తెలుసు. నా గురించి పవన్ గారికి అలా అనిపించకపోయినా.. పక్కనున్నోళ్లు అలీ ది రాజమండ్రి అక్కడ ఏదో ఒకటి అలీని అనమని గిల్లి ఉంటే పవన్ ఆ విధంగా స్పందించొచ్చు. అయినా పవన్ కళ్యాణ్ నాకు సహాయం చేశాను అని చెబుతున్నారు. ఏ విధంగా నాకు ఆయన సహాయపడ్డాడు. సినిమాలో వేషాలిప్పించాడా? లేదంటే డబ్బు రూపంలో సహాయం చేశాడా? అలా సహాయం పొందాలనుకుంటే ఆకలి చావుతో చావనైనా చస్తా కానీ.. నేను అలాంటి సహాయం మాత్రం కోరను అంటూ ఘాటుగా స్పందించాడు అలీ.
అంతేకాదు.. ఇండస్ట్రీలో ఎంతో గొప్పవాడైన చిరు వేసిన బాటలో మీరు సినిమాల్లోకొచ్చారని.... కానీ నేను కష్టపడి ఈ ఇండస్ట్రీలో పైకి వచ్చానని అన్నాడు. అలాగే జనసేన పార్టీ పెట్టినప్పుడు అలీ నేనుపార్టీ పెట్టాను.. నాపార్టీలో చేరు అని మీరెప్పుడైనా నన్ను అడిగారా? లేదు. అలాగే రాజమండ్రిలో అలీ చూట్టానికి టికెట్ఇ చ్చాను.. అదే అలీ అడిగితే ఇవ్వనా.... మా చూట్టానికి టికెట్ నన్ను అడిగి ఇచ్చారా? అయినా నేను ఏ పార్టీలో చేరితే మీకెందుకు... వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరకూడదా ? అదేమైనా తప్పా? రాజ్యాంగ విరుద్ధమా.. అయినా మీ స్థానం ఎప్పుడు నా గుండెల్లో ఉంటుందని నేను అందరికి చెప్పాను.. మీరు పార్టీ పెట్టినప్పుడు మంచి మనసుతో మీరు మీ పార్టీ బావుండాలని ఖురాన్ తెచ్చి గిఫ్ట్ ఇచ్చాను. అయినా మీరు నన్ను అలా విమర్శించడం ఏం బాలేదు. ఎందుకు సర్ కామెంట్ చేయడం.. నాకు చాలా బాధగా ఉంది. క్షమించండి.. ధన్యవాదాలు అంటూ మెత్తగా పవన్ ని అలీ కడిగి ఎండేసాడు.