పండిత పుత్రహ: పరమశుంఠ: అనేది సామెత. నిజానికి తండ్రి గొప్పవాడైతే కొడుకు కూడా గొప్పవాడు కావాలని లేదు. ఇక తండ్రి చెడ్డవాడైతే కొడుకు చెడ్డవాడు.. అన్న తప్పు చేస్తే తమ్ముడు కూడా తప్పు చేస్తాడని ఊహించుకుని మాట్లాడటం సభ్యత కాదు. అది మిడిమిడి జ్ఞానంతో చేసిన వ్యాఖ్యలే అవుతాయి. కానీ మరణించిన వారందరు మంచోళ్లు అన్నట్లు చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదు గానీ వైఎస్ హయాంలో ఎంత మంచి జరిగిందో అంతకంటే చెడు ఎక్కువగా జరిగింది. ఇక వైఎస్ ఏనాడు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే వారికి అసమ్మతిగా ఉంటూ విద్వేషాలు రెచ్చగొట్టేవాడు. ఆయన వల్ల కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి నుంచి అందరు అసమ్మతిని ఎదుర్కొన్నవారే.
ఇక విషయానికి వస్తే జగన్‌ది కూడా అదే దరువు. రోశయ్య ముఖ్యమంత్రి అయితే ఆయనను దించేవరకు జగన్ నిద్ర పోలేదు. ఇక తాజాగా షర్మిల మాటలు చూస్తే ఆ మాటలు తమకి కూడా వర్తిస్తాయనే విషయాన్ని ఆమె మరిచిపోయిందనే చెప్పాలి. ఆమె జనసేనాని పవన్‌కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, తన అన్న చిరంజీవిని, పవన్‌కళ్యాణ్ ఆదర్శంగా తీసుకున్నాడు. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. జనసేన పార్టీని పవన్ హోల్‌సేల్‌గా చంద్రబాబు టిడిపికి అమ్మివేశాడు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ నడుస్తున్నాడు.
ఏపీలో అవినీతి పాలన పోయి రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. టిడీపీ వారు డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు. ఆ డబ్బులు పంచడానికి ఎవరైతే వస్తారో వారిని కూర్చోబెట్టి బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలు ప్రశ్నించాలని కోరారు. వైసీపీకి మాత్రం మోదీతో, టిఆర్‌ఎస్‌తో అవగాహన లేదంటూ పవన్‌కి మాత్రం చంద్రబాబుతో అవగాహన ఉందని రెండు నాల్కల ధోరణిలో షర్మిలా మాట్లాడటం అజ్ఞానమే అవుతుందని చెప్పాలి.