Advertisementt

ఎట్టకేలకు బన్నీ సరసన ఛాన్స్ కొట్టింది

Mon 08th Apr 2019 10:22 PM
rashmika mandanna,heroine,allu arjun,sukumar film  ఎట్టకేలకు బన్నీ సరసన ఛాన్స్ కొట్టింది
Rashmika gets Chance in Allu Arjun Film ఎట్టకేలకు బన్నీ సరసన ఛాన్స్ కొట్టింది
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన మొదట్లో ఛలో, గీత గోవిందం బ్యూటీ రష్మిక మందన్న పేరు బాగా వినబడింది. కానీ ప్రస్తుతం స్టార్ రేంజ్ ఎక్కువున్న పూజ హెగ్డేనే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం రిపీట్ చేస్తున్నాడని.. సెకండ్ హీరోయిన్ గా కేథరిన్ నటిస్తుందని ప్రచారం మొదలైంది. అయితే త్రివిక్రమ్ సినిమాలో బన్నీ సరసన ఛాన్స్ రాకపోయినా.. తాజాగా బన్నీ మరో సినిమాలో రష్మిక బుక్ అయినట్లుగా సమాచారం.

త్రివిక్రమ్ తర్వాత సుకుమార్ తో అల్లు అర్జున్ చెయ్యబోయే చిత్రంలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా ఎంపికైందని న్యూస్ వినబడుతుంది. ఎర్రచందనం బ్యాగ్డ్రాప్ లో అల్లు అర్జున్ తో సినిమాని ఆగష్టు నుండి పట్టాలెక్కించనున్న సుకుమార్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడట. 

ఇక బన్నీకి హీరోయిన్ ని కూడా సెట్ చేసాడని.. గీత గోవిందంతో ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక పేరుని సుకుమార్ సజెస్ట్ చెయ్యడం.. అల్లు అర్జున్ ఓకే చెప్పెయ్యడం జరిగిందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఆర్య, ఆర్య 2 సినిమాలతో సుకుమార్ డైరెక్షన్ లో నటించి హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు ముచ్చటగా సుకుమార్ డైరెక్షన్ లో మూడోసారి నటిస్తున్నాడు.

Rashmika gets Chance in Allu Arjun Film:

Rashmika in Allu Arjun and Sukumar Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ