Advertisementt

‘శూర్పణఖ’ చిత్ర విశేషాలివే

Sun 07th Apr 2019 12:22 PM
director bhargava,soorpanakha film,details  ‘శూర్పణఖ’ చిత్ర విశేషాలివే
Soorpanakha Movie Details ‘శూర్పణఖ’ చిత్ర విశేషాలివే
Advertisement
Ads by CJ

భార్గవ దర్శకత్వంలో మైథలాజికల్  సోషల్ కామెడీ చిత్రం ‘శూర్పణఖ’

తెలుగులో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం ‘కిట్టు’ (2006) తో జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత  భార్గవ దర్శకత్వంలో  ‘శూర్పణఖ’ పేరుతో ఒక చిత్రం రూపొందనుంది. భార్గవ పిక్చర్స్ , కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్లపై భార్గవ, D.R రెడ్డి సంయుక్తంగా  నిర్మించనున్నారు. 

ఈ సందర్భంగా రచయిత, దర్శకుడు భార్గవ మాట్లాడుతూ  ‘‘మైథలాజికల్  సోషల్ కామెడీ చిత్రం ఇది. రామాయణంలో కీలకమైన మలుపులు  శూర్పణఖ వల్లనే  సంభవించాయి. శూర్పణఖ ప్రస్తుత సమకాలీన సమాజంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనే  కధాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. అసలు శూర్పణఖ ఇప్పుడు ఎలా వచ్చింది ? అసలు వచ్చి ఏం చేసింది ? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం శూర్పణఖ దృక్కోణం నుండి రామాయణం చెప్పడమే ! శూర్పణఖ ఏ విధంగా అప్పటి లంకను, ఇప్పటి సమాజంతో, అలాగే  అప్పటి ప్రజల్ని ఇప్పటి ప్రజలతో ఎలా పోలుస్తుందో ఈ చిత్రంలో కథగా అల్లడం జరిగింది’’ అని తెలిపారు. 

చిత్ర నిర్మాతలలో  ఒకరైన D.R  రెడ్డి  మాట్లాడుతూ ‘‘శూర్పణఖ పాత్రని ఒక ప్రముఖ నటి చేయబోతుంది. ఆ  వివరాలు మరియు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తాం. ఈ చిత్రం లో vfx కు అధిక ప్రాధాన్యత ఉండడం వలన  ప్రీ ప్రొడక్షన్ పకడ్బందీగా చేసుకుంటున్నాం. వచ్చే నెలలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది’’ అని తెలిపారు . 

ఈ చిత్రానికి కథ , మాటలు, కథనం , దర్శకత్వము - భార్గవ . 

నిర్మాతలు: భార్గవ, D.R  రెడ్డి 

బ్యానర్స్ : భార్గవ పిక్చర్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్  

Soorpanakha Movie Details:

Bhargava Directs Soorpanakha Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ