Advertisementt

‘యాత్ర’కు ఈసీ గ్రీన్ సిగ్నల్

Sun 07th Apr 2019 11:56 AM
election commission,clears,yatra movie,telecasting,tv premiere  ‘యాత్ర’కు ఈసీ గ్రీన్ సిగ్నల్
Election Commission Clears Yatra TV Telecasting ‘యాత్ర’కు ఈసీ గ్రీన్ సిగ్నల్
Advertisement
Ads by CJ

స్టార్ మా ఛాన‌ల్ లో ఆదివారం(7/04/2019) మ‌ధ్యాహ‌న్నం 12 గంట‌ల‌కు 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ యాత్ర‌

70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై శివ మేక స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య్ చిల్లా శ‌శిదేవ‌రెడ్డి నిర్మాత‌లుగా ఆనందో బ్రహ్మా ఫేమ్ మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా యాత్ర‌. ఫిబ్ర‌వ‌రి 8, 2019న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి జీవిత‌గాథ అధారంగా త‌రకెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖ‌ర్ రెడ్డి గారి పాత్ర‌ను మ‌ళ‌యాలీ మెగాస్టార్ మోహ‌న్ లాల్ పోషించారు.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్రపంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజైన ఈ సినిమాకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు అభిమానుల‌తోపాటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో బిగ్ స్క్రిన్ పై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్న యాత్ర ఇప్పుడు టీవిలో కూడా ఆ హిట్ ఫీట్ రిపీట్ చేయ‌బోతుంద‌ని చిత్ర బృందం న‌మ్మ‌కంగా చెబుతున్నారు. స్టార్ మా ఛాన‌ల్ లో ఆదివారం(7/04/2019) మ‌ధ్యాహ‌న్నం 12 గంట‌ల‌కు ఈ సినిమాను టెలికాస్ట్ చేస్తున్న‌ట్లుగా నిర్మాత‌లు విజ‌య్ చ‌ల్లా, శ‌శి దేవ‌రెడ్డి చెప్పారు.

అయితే ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో  న‌డుస్తున్న రాజ‌కీయ ప‌రిణామాల రీత్య‌, ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌టం కార‌ణంగా యాత్ర టెలికాస్ట్ ను అడ్డుకునేందుకు కొంద‌రు రాజ‌కీయ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డం, అయితే ఆ ఫిర్యాదును ఎన్నిక‌ల సంఘం, తిర‌స్క‌రించింది. స్టార్ మా లో యాత్ర టెలికాస్ట్ ని అడ్డుకునే హక్కు ఎన్నిక‌ల సంఘానికి లేద‌ని, ఈ ఫిర్యాదు త‌మ ప‌రిధిలోకి రాద‌ని సృష్టం చేసింది. 

Election Commission Clears Yatra TV Telecasting:

EC Clears Yatra TV Premiere    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ