సమంతతో పెళ్ళికి ముందు నాగ చైతన్యకి యుద్ధం సినిమా డిజాస్టర్. పెళ్లి తర్వాత సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు ప్లాప్. ఇక పెళ్లి తర్వాత భార్యభర్తలు కలిసి నటించే సినిమా మీద సహజంగానే అంచనాలు ఉంటాయి అందుకే మజిలీ సినిమా మొదలైంది మొదలు సమంత - చైతు కలిసి నటిస్తున్నారు అనగానే సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇక చైతుకి హిట్ గ్యారెంటీ అన్నట్టుగానే మజిలీ సినిమా చైతుని విజయ తీరానికి చేర్చింది. శివ నిర్వాణ తన మొదటి సినిమాని ఎంతందంగా ప్రేక్షకులకు అందించాడో.. తన రెండో సినిమాని అంతే అందంగా తెరకెక్కించి వదిలాడు. మరి నిన్న శుక్రవారం విడుదలైన మజిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో చైతు చాన్నాళ్లకు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.
ఇక ఈ సినిమాలో చైతు నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంశలు దక్కుతున్నాయి. చైతన్య కెరీర్ లో మజిలీలో చేసిన పూర్ణ లాంటి పరిపూర్ణమైన క్యారెక్టర్ ఇంతకుముందు దక్కలేదు. జీవితంలో వివిధ దశలు చూపించే ఈ పాత్రలో చైతు తన శక్తి మేర నటించాడు. నటుడిగా ఇది నాగచైతన్యకి ప్లస్ అయ్యే క్యారెక్టరు. చైతు చేసిన అత్యంత కష్టమైన పాత్రల్లో ఇదొకటి. రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అతను చూపించిన వైవిధ్యం మెప్పిస్తుంది. 20 ఏళ్ల కుర్రాడు ఆ వయసులో ఎలా ఉంటాడో కనిపించిన చైతూ.. ప్రేమలో విఫలమై తాగుడుకు బానిసైన వ్యక్తిగా కూడా అతికినట్లు సరిపోయాడు.
రెండు పాత్రల్లోనూ అద్భుతంగా మెప్పించాడు.ముఖ్యంగా సెకండ్ హాఫ్.. పతాక సన్నివేశంలో చైతు నటన కట్టి పడేస్తుంది. మరి ఈ రకంగా ప్రేమకథలతో మెప్పించడంలో తన బలాన్ని చైతూ మరోసారి చాటుకున్నాడు. మరి మజిలీ హిట్ ని చైతు తన భార్య సమంత తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.