Advertisementt

‘గాడీ నెం-143’ రెడీ అవుతోంది

Sat 06th Apr 2019 09:32 PM
gadi no 143,movie,post production,details  ‘గాడీ నెం-143’ రెడీ అవుతోంది
Gadi No 143 in Post Production Stage ‘గాడీ నెం-143’ రెడీ అవుతోంది
Advertisement
Ads by CJ

పోస్ట్ ప్రొడక్ష‌న్ ఫైన‌ల్ ద‌శ‌లో ‘గాడీ నెం-143’

సాయి విజ‌య గ‌ణ‌ప‌తి పిక్చ‌ర్స్ పతాకంపై హేమంత్, సురేంద్ర , అంజ‌లి, లీజా హీరో హీరోయిన్లుగా భాను ముర‌ళి.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘గాడీ నెం-143’. ( ది ట్రావెల్ ఫ‌ర్ టైంపాస్ ల‌వ్ అండ్ ట్రూ ల‌వ్)  ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా ద‌ర్శ‌కుడు భాను ముర‌ళి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో తొలిసారిగా  నిర్మాత‌గా మారి ‘గాడీ నెం-143’ చిత్రం నిర్మిస్తున్నా.  ఈస్ట్ గోదావ‌రి, అర‌కు ప‌రిస‌ర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేసాము. మా టీమ్ స‌హ‌కారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా పూర్తి చేయ‌గ‌లిగాను. త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు పూర్తి చేసి  మేలో ఆడియో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు భాను ముర‌ళి .వి మాట్లాడుతూ... ‘‘ఒక సిన్సియ‌ర్ ల‌వ్ లోకి టైం పాస్ ల‌వ్  ప్ర‌వేశించి ఎలాంటి సంఘ‌ర్షణ రేపింది అనేది చిత్ర క‌థాంశం. చివ‌ర‌కు ఏం జ‌రిగింది అనేది ఆస‌క్తిక‌ర‌మైన ముగింపు. క‌థ, క‌థ‌నాలు చాలా కొత్త‌గా  ఉంటాయి. సెన్సిబుల్ ల‌వ్, క‌డుపుబ్బ న‌వ్వించే కామెడి, హృద‌యాన్ని హ‌త్తుకునే ఎమోష‌న్స్  ఇలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులున్నాయి. యూత్, ఫ్యామిలీ  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేసి సినిమా అవుతుంది. ఉగాది సంద‌ర్భంగా మా సినిమా మోష‌న్ పోస్ట‌ర్, టీజ‌ర్  డిజిటిల్ మీడియా ద్వారా రిలీజ్ చేసాం’’ అన్నారు.

గౌతంరాజు, రైజింగ్ రాజు, జాకీ, ఫ‌ణి కాంత్, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్‌, అశోక్ వ‌ర్ధ‌న్, గంగాధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్: ఏసు.పి, స‌ంగీతం: త్రినాథ్ మంతెన‌, నిర్మాత: ఎమ్‌.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం: భాను ముర‌ళి .వి.

Gadi No 143 in Post Production Stage:

Gadi no 143 Movie Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ