Advertisementt

‘మహర్షి’ టీజర్: హిట్టుకి కామాలే.. నో ఫుల్ స్టాప్స్!

Sat 06th Apr 2019 07:22 PM
maharshi movie,maharshi teaser,mahesh babu,vamsi paidipally,maharshi telugu movie,maharshi teaser review  ‘మహర్షి’ టీజర్: హిట్టుకి కామాలే.. నో ఫుల్ స్టాప్స్!
Maharshi Movie Teaser Talk ‘మహర్షి’ టీజర్: హిట్టుకి కామాలే.. నో ఫుల్ స్టాప్స్!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా ‘మహర్షి’ హంగామా షురూ అయ్యింది. విడుదలకు నెల రోజులే గడువు ఉండడంతో.. టీమ్ మహర్షి ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసేసింది. మహేష్ - పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ని ఉగాది కానుకగా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. మహర్షి టీజర్‌లో మహేష్ బాబు లుక్స్, స్టైల్ అన్ని సూపర్బ్‌గా ఉన్నాయి. రిషి కుమార్ పాత్రలో మహేష్ చాలా స్టైలిష్‌గా చాపర్ నుండి దిగడంతో మొదలైన టీజర్ రిషి కుమార్ సక్సె‌స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్లేనా.. అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్‌లో మీడియా మీట్లో మహేష్ కి ప్రశ్న ఎదురు కాగా... దానికి మహేష్ సక్సెస్ లో పుల్ స్టాప్స్ ఉండవు. కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అన్న భారీ డైలాగ్స్‌కి థియేటర్స్‌లో విజిల్స్ పాడడం ఖాయంగా కనబడుతుంది.

ఇంకా నాకో ప్రాబ్లమ్ ఉంది సార్... ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే... గెలిచి చూపించడం నాకు అలవాటు అంటూ స్టైలిష్ యాక్షన్‌తో మహేష్ మెరుపులు మెరిపించాడు. కాకపోతే టీజర్ చివర్లో మహేష్ చేసిన ఆ యాక్షన్ సన్నివేశాన్ని చూస్తుంటే రెండు మూడు సినిమాల్లో ఆ యాక్షన్ సీన్ ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మహేష్ భరత్ అనే నేను లో, అల్లు అర్జున్ సరైనోడు లో హీరో విలన్స్ ని కొడుతూ... రౌడీ కాలుని పట్టుకుని లాక్కెళ్ళే సీన్ మళ్ళీ మహర్షి లో వంశి పైడిపల్లి రిపీట్ చేసాడనిపిస్తుంది. తప్ప ఓవరాల్‌గా మహర్షి టీజర్ మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది. దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి. కాకపోతే హీరోయిన్ పూజా హెగ్డే ని కానీ, మహేష్ ఫ్రెండ్ కేరెక్టర్ అల్లరి నరేష్ రవి పాత్రనిగానీ మహర్షి టీజర్‌లో రివీల్ చెయ్యలేదు. 

>టీజర్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Maharshi Movie Teaser Talk:

Maharshi Movie Teaser Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ