Advertisementt

ప్రభాస్‌కు నచ్చితే అంతే.. తెచ్చేసుకోవడమే!

Sat 06th Apr 2019 01:13 PM
prabhas,prized possessions,saaho,car,bike,souvenirs  ప్రభాస్‌కు నచ్చితే అంతే.. తెచ్చేసుకోవడమే!
Saaho.. Prabhas Takes Home a Car and a Bike as Souvenir ప్రభాస్‌కు నచ్చితే అంతే.. తెచ్చేసుకోవడమే!
Advertisement
Ads by CJ

గతంలో చాలా మంది స్టార్స్‌ తమ చిత్రాలలో వాడిన కాస్ట్యూమ్స్‌, ఇతర వస్తువులు తమకు నచ్చితే వాటిని తమ ఇంటికి తెప్పించుకునే వారు. హీరోగారు కావడంతో నిర్మాతలు కూడా హీరో అడిగిన వాటిని ఇష్టం ఉన్నా లేకున్నా ఆయనకు ఇచ్చేవారు. ఇక విషయానికి వస్తే యంగ్‌రెబెల్‌ స్టార్‌ నుంచి నేషనల్‌ స్టార్‌గా మారిన హీరో ప్రభాస్‌. ఇక యువి క్రియేషన్స్‌ అంటే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఆయన సొంత నిర్మాణ సంస్థ వంటిది. ప్రస్తుతం యువి క్రియేషన్స్‌ బేనర్‌లో ప్రభాస్‌ దాదాపు 300కోట్ల పైగా బడ్జెట్‌తో హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం స్థాయిలో ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులోని యాక్షన్‌ సీన్స్‌ని హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ చేతిలో పెట్టారు. సినిమా యాక్షన్‌ సీన్స్‌కి సంబంధించి ఎన్నో కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలు వాడుతున్నారు. 

ఇక ప్రభాస్‌కి ఏదైనా సరే బ్రాండెడ్‌ అంటే చాలా ఇష్టం. గతంలో ఆయన కోసం కొందరు బ్రాండెడ్‌ వాచీలను కూడా బహుమానంగా ఇచ్చేవారు. ఇక  ‘సాహో’ చిత్రం షూటింగ్‌ కోసం వాడుతున్న బైక్‌లు, కార్లు.. వీటిల్లో తనకి నచ్చిన వాటిని ప్రభాస్‌ తన సొంత గ్యారేజీకి తరలిస్తున్నాడట. షూటింగ్‌ తర్వాత కూడా వాటిని వాడాలనే కోరికతో ఆయన లీజ్‌కి తీసుకున్న వాటిని కొనుగోలు చేసి మరి తన సొంతం చేసుకుంటున్నాడని సమాచారం. 

కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ బైక్‌ యాక్షన్‌ సీన్‌కి సంబంధించిన ఫొటో బయటకు లీక్‌ అయిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రభాస్‌ ‘ట్రిమ్ప్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ ఆర్‌ఎస్‌’ అనే బైక్‌ని ఉపయోగించాడు. 765సిసి లైన్‌ త్రీ సిలిండర్‌ ఇంజన్‌ ద్వారా ఈ బైక్‌కి పవర్‌ సప్లై అవుతుంది. ఈ బైక్‌ టాప్‌ లైన్‌ మోడల్‌ ధర (ఎక్స్‌షోరూమ్‌) 10.55లక్షలు అని తెలుస్తోంది. ఈ బైక్‌ని ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’తో పాటు పలు హాలీవుడ్‌ చిత్రాలలో ఉపయోగించారని తెలుస్తోంది. దీనిపై మోజు పడిన ప్రభాస్‌ ఈ బైక్‌ని సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇక జిల్‌రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ వింటేజ్‌ కార్ల వ్యాపారిగా నటిస్తున్నాడు. సో.. ఆ చిత్రంలోని కార్లు కూడా ప్రభాస్‌కి నచ్చితే అవి ఆయన సొంత గ్యారేజీకి తరలిపోవడం ఖాయమనే చెప్పాలి. 

Saaho.. Prabhas Takes Home a Car and a Bike as Souvenir:

Prabhas Takes Home Two Prized Possessions from Saaho as souvenirs 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ