మెగాస్టార్ చిరంజీవి దశాబ్దం గ్యాప్ తర్వాత సినిమాలలోకి వచ్చి తన ప్రతిష్టాత్మక 150వ చిత్రంగా వినాయక్ దర్శకత్వంలో తన కుమారుడు రామ్‌చరణ్ స్థాపించిన హోమ్ బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో తమిళ ‘కత్తి’కి రీమేక్‌గా ‘ఖైదీనెంబర్ 150’ చిత్రం చేశాడు. రీఎంట్రీని ఘనంగా ప్రారంభించిన చిరు ఈ చిత్రం ద్వారా ‘నాన్‌బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టాడు. బహుశా ‘నాన్‌బాహుబలి’ కాదు.. ఏకంగా ‘బాహుబలి’ రికార్డులనే బద్దలు కొట్టే ఉద్దేశ్యంతో కాబోలు భారీ బడ్జెట్‌తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా, తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుని బయోపిక్‌గా ‘సై..రా...నరసింహారెడ్డి’ ప్రారంభించాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కూడా రామ్‌చరణే నిర్మాత. గత ఏడాది నుంచి చిరు ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి పండుగకు కూడా గ్యాప్ ఇవ్వకుండా కష్టపడుతున్నాడు.
తాజాగా ఆయన ఈ చిత్రానికి కాస్త బ్రేక్ ఇచ్చి సతీసమేతంగా జపాన్‌లో రిలాక్స్ అవుతున్నాడు. ఇండియాకి వచ్చిన వెంటనే మరలా ‘సై..రా’తో బిజీ కానున్నాడు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తామని రామ్‌చరణ్ అంటున్నాడు. మరికొందరు మాత్రం ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు చిరు తన 152వ చిత్రాన్ని మెసేజ్ కం కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మూవీని రామ్‌చరణ్‌తో కలిసి మ్యాట్నీమూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ‘సై...రా’కి సంబంధించిన తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్న తర్వాత చిరు జూన్ నుంచి కొరటాల చిత్రంలో జాయిన్ అవుతాడని సమాచారం.
రీఎంట్రీలో ‘ఖైదీనెంబర్ 150’లో కాజల్ అగర్వాల్, ‘సై...రా’లో నయనతార, తమన్నాలతో జోడీ కడుతున్న చిరు కొరటాల చిత్రంలో ఎవరితో జోడీ కడతాడో వేచిచూడాల్సివుంది. కొరటాల ప్రస్తుతం హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నాడట. మంచి మెసేజ్‌తో పాటు తనదైన కమర్షియల్ యాంగిల్‌లో చిరు కోసం కథను రెడీ చేసుకున్న కొరటాల చిరంజీవితో చేసే చిత్రాన్ని వచ్చే వేసవి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నాడట. అంటే మొత్తం మీద చిరు ‘సై...రా’కొరటాల మూవీలను కాస్త గ్యాప్‌లోనే అంటే ఓ ఏడాది సమయంలో విడుదల చేయడం ఖాయమని అంటున్నారు. మరి ఇందులో చిరు సరసన చిందేసే భామ ఎవరో తేలాల్సివుంది...!