గతంలో సిద్దార్ధ ప్రేమలో సమంత కెరీర్ ని నాశనం చేసుకుంటుందని చాలానే వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. మధ్యలో సిద్దార్ద్ తో బ్రేకప్ అయ్యాక నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి విషయంలో సమంత బాగా హైలెట్ అయ్యింది. ఇక టాప్ రేంజ్ లో ఉండగానే సమంత పెళ్లి చేసేసుకుంది. పర్సనల్ లైఫ్ లో ఇలాంటి న్యూస్ లు తప్ప ప్రొఫెషనల్ గా సమంత సినిమాల విషయంలో దర్శకనిర్మాతలు హీరోలను ఎక్కడా ఇబ్బంది పెట్టినట్టుగా వినిపించలేదు కనిపించలేదు. కానీ తాజాగా సమంతపై ఇలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
పెళ్లి తర్వాత సమంత ఎప్పటిలాగే కెరీర్ లో దూసుకుపోతుంటే... భర్త నాగ చైతన్య మాత్రం కాస్త డల్ పొజిషన్ లో ఉన్నాడు. పెళ్ళికి ముందు కలిసి రెండు మూడు సినిమాలు చేసిన ఈజంట.. పెళ్లి తర్వాత భర్త చైతు కెరీర్ ని నిలబెట్టడానికే సమంత, చైతుతో కలిసి మజిలీ సినిమా చేసింది. అయితే మజిలీ సినిమా విషయంలో సమంత, చైతు లుక్స్ విషయంలోనూ క్యారెక్టర్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద పెట్టిందట. అంతవరకూ ఓకే..
కానీ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన దివ్యంకాని, సమంత కావాలనే ఫోకస్ కాకుండా తొక్కేసిందనే న్యూస్ ఉంది చూశారూ.. అది మాత్రం హాట్ హాట్ గా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. మజిలీ సినిమాకి తానే ఆయువుపట్టు, తాను లేనిదే సినిమా లేదు అన్నట్టుగా ఉన్న సమంత ప్రవర్తనకు మజిలీ మేకర్స్ కూడా కాస్త ఇబ్బంది పడ్డారట. ఇక దివ్యంకాని తనకున్న క్రేజ్ తో తొక్కేసిందని, ఆమెని ఎక్కడా హైలెట్ కాకుండా సమంత ప్రయత్నించిందని... అందుకే ఆ హీరోయిన్ తో మజిలీ టీం పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదట. మరి సమంత మీదొచ్చిన ఈ న్యూస్ లో ఎంతవరకు నిజముందనేది స్పష్టత లేదు.