Advertisementt

పాపం శృతి.. అది కూడా పోయింది

Thu 04th Apr 2019 09:08 PM
shruti haasan,clarity,re entry,tollywood,movies,chiranjeevi,koratala shiva  పాపం శృతి.. అది కూడా పోయింది
No Shruti Haasan in Chiru and Koratala Film పాపం శృతి.. అది కూడా పోయింది
Advertisement
Ads by CJ

శృతి హాసన్ ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది. తెలుగులో కాటమరాయుడు సినిమాతో మళ్ళీ కనబడిన ఈభామ బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసినా ఓ అన్నంత క్రేజ్ అయితే ఈ భామకి లేదు. టాలీవుడ్ లో శృతి హాసన్ ఒక సీనియర్ హీరోతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందనే న్యూస్ గత నెలరోజులుగా మీడియాలో వినబడుతుంది. చిరంజీవి - కొరటాల కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం కొరటాల, శృతి హాసన్ పేరును చిరు పక్కన పరిశీలించాడనే టాక్ నడిచింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ పక్కన నటించిన శృతిహాసన్ ని చిరంజీవి కోసం కొరటాల తెస్తున్నాడనే అనుకున్నారు అంతా..

కానీ తాజా సమాచారం ప్రకారం శృతి హాసన్ కి చిరు సినిమా నుండి ఎటువంటి ఆఫర్ రాలేదంట. కొరటాల శివ, చిరు కోసం శృతి హాసన్ పేరుని పరిశీలించిన మాట నిజమే కానీ.... చిరు పక్కన శృతి హాసన్ అంత నప్పదని భావించి.. శృతిని హీరోయిన్స్ లిస్ట్ నుండి తీసేశాడని ఫిలింనగర్ టాక్. ఇదే విషయాన్నీ శృతి కూడా ఒప్పుకుంది. 

తనకి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేవని... అయితే అవ‌కాశాలు రావ‌డం లేద‌న్న బెంగలేద‌ని..... త‌న దృష్టి పూర్తిగా సంగీతంపైనే ఉంద‌ని అలాగే న‌టిగా త‌న‌కు మ‌రో బ్రేక్ త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని చెబుతుంది. మరి నిజంగానే చిరు పక్కన అవకాశం వచ్చినట్టే వచ్చి తృటిలో తప్పిపోయింది అంటే పాపం శృతి అనాలి కదా..!

No Shruti Haasan in Chiru and Koratala Film:

Shruti Haasan Clarity on her Re entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ