మహేష్ బాబు - వంశి పైడిపల్లి కాంబో మహర్షి మూవీ అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలున్న మహర్షి సినిమాపై ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. రాజమౌళి సినిమాల తర్వాత అంత క్రేజ్ మళ్ళీ మహేష్ సినిమాలకే కనబడుతుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న మహర్షి థియేట్రికల్ బిజినెస్ 100 కోట్లు దాటిందని ప్రచారం జరుగుతుండగా... డిజిటల్ రైట్స్ 11 కోట్లకి అమెజాన్ వారు ఎగరేసుకుపోయారు.. ఇక మహర్షి శాటిలైట్ హక్కులు కూడా రికార్డు స్థాయిలో 16 కోట్లకు అమ్ముడుపోయాయని న్యూస్ సోషల్ మీడియాని, ఫిలింనగర్ ని చుట్టేస్తుండగా...తాజాగా మహర్షిపై మరో న్యూస్ ఫిలింనగర్ లో వినబడుతుంది.
దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ కలిసి సంయుక్తంగా భారీగా నిర్మిస్తున్న మహర్షి మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కు కూడా 26 కోట్ల భారీ ధర పలికినట్లుగా తెలుస్తుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా బాలీవుడ్ లో మంచి పేరుండడం, అలాగే మహేష్ క్రేజ్ కూడా మహర్షి హిందీ డబ్బింగ్ రైట్స్ కి ఆ రేటు పలికిందని చెబుతున్నారు. ఇప్పటికే ఆకాశాన్ని తాకే అంచనాలున్న మహర్షి మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. మే తొమ్మిదికి విడుదలకాబోతున్న మహర్షి మూవీ సంచనాలు ఇంకెన్ని వినబడతాయేమో చూద్దాం.