Advertisementt

మహేష్‌ని డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్! మరి బన్నీ?

Thu 04th Apr 2019 06:08 PM
trivikram srinivas,directs,ad,mahesh babu  మహేష్‌ని డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్! మరి బన్నీ?
Confusion: Trivikram directs Mahesh Babu మహేష్‌ని డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్! మరి బన్నీ?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన వచ్చి ఆరునెలలైనా ఆ కాంబో ఇంకా పట్టాలెక్కలేదు. బన్నీ - త్రివిక్రమ్ సినిమా మీద రకరకాల న్యూస్ లు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ మీద నమ్మకం లేక సుకుమార్ వైపు చూస్తున్నాడని.. సుకుమార్ తో ఎప్పుడెప్పుడు సినిమా మొదలెడదామా అన్నట్లుగా బన్నీ చూస్తున్నాడని అంటున్నారు. ఈలోపు త్రివిక్రమ్, మహేష్ తో పని చేయబోతున్నాడనే న్యూస్ హైలెట్ అయ్యింది. మహేష్ తో త్రివిక్రమ్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు చేసాడు. 

అయితే మహేష్ తో గత కొంతకాలంగా సినిమాలు చెయ్యకపోయినా... మహేష్ తో చాలా యాడ్ షూట్స్ ని త్రివిక్రమ్ చేస్తున్నాడు. ఆ రకంగా త్రివిక్రమ్ - మహేష్ కలిసే పనిచేస్తున్నారు. తాజాగా త్రివిక్రమ్, మహేష్ తో సినిమా చెయ్యడం లేదు కానీ. ఒక యాడ్ ఫిలింని ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ స్టార్స్ తో క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ కొన్నింటిని త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేశాడు. అయితే ప్రస్తుతం మహేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఆ యాడ్ ఒక యాప్‌కి సంబంధించినదని... ఈనెల 10 నుండి ఆ యాడ్ షూటింగ్ జ‌ర‌గ‌బోతోందట. 

మరి ప్రస్తుతం మహేష్, మ‌హ‌ర్షి షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి.. ఈ యాడ్ షూట్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. మరి త్రివిక్రమ్ ని బన్నీ సినిమాని ఏం చేసావ్.. ఇలా మహేష్ తో యాడ్ షూట్ చేస్తున్నావ్ అంటూ బన్నీ అభిమానులు త్రివిక్రమ్ మీద ఒంటికాలుతో లేస్తున్నారు.

Confusion: Trivikram directs Mahesh Babu:

Trivikram Directs AD with Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ