Advertisementt

‘మన్మథుడు 2’లో నాగ్ కోడలు కూడా?

Thu 04th Apr 2019 04:46 PM
nagarjuna,daughter in law,samantha,guest role,manmadhudu 2 film  ‘మన్మథుడు 2’లో నాగ్ కోడలు కూడా?
Samantha in Nag Manmadhudu 2 Movie ‘మన్మథుడు 2’లో నాగ్ కోడలు కూడా?
Advertisement
Ads by CJ

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మన్మథుడు 2 సినిమా పట్టాలెక్కేసింది. గతంలో నాగార్జున - సోనాలి బింద్రే జంటగా తెరకెక్కిన మన్మథుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. నాగార్జున మళ్ళీ అదే నమ్మకంతో ఇప్పుడు చి.ల.సౌ ఫేమ్ రాహుల్ తో మన్మథుడు 2 ని మొదలెట్టడం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడం కూడా జరిగింది. తాజాగా మన్మథుడు 2 వర్కింగ్ ఫొటోస్ ని నాగ్ సోషల్ మీడియాలో షేర్ కూడా చేసాడు. మా మన్మథుడు ఫ్యామిలీ అంటూ అందరిని పరిచయం చేసాడు. అందులో వెన్నెల కిషోర్ ఇంకా ముఖ్యమైన నటీనటులు ఉన్నారు.

అయితే తాజాగా మన్మథుడు 2 లో నాగ్ కోడలు సమంత కూడా నటిస్తుందని టాక్ వినబడుతుంది. సమంత మన్మథుడు 2 లో ఒక గెస్ట్ రోల్ చేయబోతోందని.. మామ నాగ్ కోసం ఫ్రెండ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కోసం ఆ రోల్ ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే మజిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమంత... నంది రెడ్డి మిస్ గ్రానీ లోను, అలాగే దిల్ రాజు తమిళ రీమేక్ 96 లోను నటిస్తుంది. తాజాగా మామ కోసం ఈ స్పెషల్ రోల్ కూడా చేయబోతుంది. మరి మన్మథుడు 2 లో మామాకోడళ్ల రచ్చ ఏ లెవెల్లో ఉంటుందో చూద్దాం.

Samantha in Nag Manmadhudu 2 Movie:

Nag daughter in law in His Manmadhudu 2 Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ