Advertisementt

లిప్‌లాక్‌: రాజశేఖర్ కూతురు రికార్డ్!

Thu 04th Apr 2019 12:46 AM
rajasekhar,daughter,sivatmika,aanand deverakonda,dorasani movie,liplock  లిప్‌లాక్‌: రాజశేఖర్ కూతురు రికార్డ్!
Rajasekhar Daughter Creates Record with Liplock లిప్‌లాక్‌: రాజశేఖర్ కూతురు రికార్డ్!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి వారు తమ కుమారులను వారసత్వంతో ముందుకు తీసుకుని వెళ్లారు. కానీ కుమార్తెల విషయంలో మాత్రం ఇది జరగడం లేదు. తమ అభిమాన హీరో కుమార్తె గ్లామర్‌షో చేస్తూ, వేరే హీరోతో రొమాన్స్‌ చేయడాన్ని మన టాలీవుడ్‌ ప్రేక్షకులు, అభిమానులు జీర్ణించుకోలేరు. అదే బాలీవుడ్‌ తరహా మాత్రం వేరు. అక్కడ పెళ్లయిన వారు. పిల్లలు ఉన్నఆంటీలు, వారసురాళ్లు కూడా గ్లామర్‌షోకి నోచెప్పరు. నిజానికి కృష్ణ కుమార్తె మంజులకు బాలకృష్ణ-ఎస్వీకృష్ణారెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాప్‌హీరో’ చిత్రంలో సౌందర్య స్థానంలో మొదట చాన్స్‌ వచ్చింది. కృష్ణ, మంజుల అందరు ఓకే అన్నారు గానీ కృష్ణ అభిమానులు, అందునా బాలయ్య సరసన అనే సరికి రాద్దాంతం చేశారు. దాంతో మంజుల కాన్సెప్ట్‌, హీరోయిన్‌ ఓరియంటెడ్‌, ప్రయోగాత్మక చిత్రాలకే పరిమితం అయింది. 

ఇక చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ వంటి స్టార్స్‌కూడా తమ కూతుర్లని నటన వైపు ప్రోత్సహించలేదు. మెగాడాటర్‌ ‘ఒక్క మనసు, హ్యాపీవెడ్డింగ్‌, సూర్యకాంతం’ వంటి చిత్రాలలో కూడా మెప్పించలేదు. దాంతో ఆమె త్వరలో వివాహానికి రెడీ అవుతోంది. ఇక విషయానికి వస్తే రాజశేఖర్‌ -జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక, విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయం అవుతోన్న ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. 

తాజాగా టైటిల్‌తో కూడిన లోగో పోస్టర్‌ విడుదలైంది. టాలీవుడ్‌ సమాచారం ప్రకారం ఇందులో శివాత్మికకు ఆనంద్‌ దేవరకొండకి మధ్య ఓ ఘాడమైన లిప్‌లాక్‌ ఉంటుందిట. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో దొరసాని కుమార్తెగా శివాత్మిక, పాలేరు కుమారుడుగా ఆనంద్‌ దేవరకొండ నటిస్తున్నారు. సమ్మర్‌లో విడుదలకు సిద్దమవుతోన్న ఈ చిత్రంలో వీరి మధ్య లిప్‌లాక్‌ ఉంటే టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంలోనే లిప్‌లాక్‌లో నటించిన వారసురాలిగా రాజశేఖర్‌ కుమార్తె పేరు తెచ్చుకుంటుంది. ఇక తన అన్నయ్య విజయ్‌ దేవరకొండలాగే తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కూడా లిప్‌లాక్‌ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది. 

Rajasekhar Daughter Creates Record with Liplock:

Rajasekhar Daughter Sivatmika in Dorasani Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ