Advertisementt

శివ నిర్వాణ నెక్స్ట్ ఏంటి..!

Wed 03rd Apr 2019 04:43 PM
shiva nirvana,majili movie,next film,star hero  శివ నిర్వాణ నెక్స్ట్ ఏంటి..!
Shiva Nirvana Next Project Details శివ నిర్వాణ నెక్స్ట్ ఏంటి..!
Advertisement
Ads by CJ

నిన్నుకోరి లాంటి ఫీల్ గుడ్ మూవీ అందరి మనసులు దోచుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ‌ ఈ సినిమా తరువాత పెద్ద హీరోలకు కథలు కూడా చెప్పాడు కానీ అవిఏమి వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో నాగ చైతన్య - సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా తీసాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది.

ఏప్రిల్ 5 న విడుదల అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే వెంటనే పెద్ద హీరోస్ తో సినిమా చేయాలనీ డిసైడ్ అయిపోయాడట శివ. శివకి ఆల్రెడీ మజిలీ నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు శివ త‌న మూడో సినిమాని ఆ సంస్థ‌కే చేయాలి.

మజిలీ రిలీజ్ అయిన నెల రోజులకి పెద్ద హీరోతో సినిమా సెట్స్ మీదకు తీసుకుని వెళ్తానని అంటున్నాడు. అందుకు సంబంధించి స్క్రిప్ట్స్ కూడా తన దగ్గర రెడీగా ఉన్నాయని చెబుతున్నాడు. శివ చూపు బ‌న్నీ, ఎన్టీఆర్‌, విజ‌య్‌ దేవ‌ర‌కొండ లాంటి హీరోల‌పై ఉంద‌ని, వాళ్ల కోసం త‌గిన క‌థ‌ల్ని కూడా సిద్దం చేశాడ‌ని స‌మాచారం. 

‘నా దగ్గర పెద్ద హీరోలతో చేయడానికి రెండు మూడు కథలు రెడీగా ఉన్నాయి. ఒకటి కామెడీ జోనర్ అయితే మరొకటి యాక్ష‌న్ క‌థ‌. అలానే నాకు హార‌ర్‌, థ్రిల్లర్ సినిమాలూ చేయాల‌నివుంది’ అంటున్నాడు శివ‌. మజిలీ హిట్ అయితే శివకు పెద్ద హీరోల డేట్స్ దొరకడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే పెద్ద హీరోలు ఎవరు ప్రస్తుతం ఖాళీగా లేరు. వాళ్ళ డేట్స్ కావాలంటే శివ కొంతకాలం ఆగాల్సిందే.

Shiva Nirvana Next Project Details:

Shiva Nirvana Next Film With Star Hero

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ