Advertisementt

మహర్షికి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ రావడంలేదంట!

Wed 03rd Apr 2019 03:22 PM
mahesh babu,maharshi movie,latest,update  మహర్షికి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ రావడంలేదంట!
NO Business to Maharshi at Overseas మహర్షికి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ రావడంలేదంట!
Advertisement
Ads by CJ

మహేష్ బాబుకున్న క్రేజ్ అలాంటి ఇలాంటి క్రేజ్ కాదు.... దర్శకుడు వంశి పైడిపల్లికి కెరీర్ లో ఒక్క బిగ్గెస్ట్ హిట్ లేకపోయినా... మహర్షి సినిమా బిజినెస్ వీరలెవల్లో జరుగుతుంది. ఇప్పటికే 100 కోట్లకి పైగానే మహర్షి థియేట్రికల్ బిజినెస్ జరిగిందని.. శాటిలైట్ హక్కులు అమ్ముడుపోకపోయినా... డిజిటల్ రైట్స్ ని అమెజాన్ వారు మాత్రం 11 కోట్లకి హక్కులు ఎగరేసుకుపోయారని.. ఇదంతా కేవలం మహేష్ క్రేజ్ వల్లే జరిగింది అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఇక్కడ ఆహా ఓహో అంటూ మహర్షి బిజినెస్ పై గొప్పలు పోతున్నారు.

కానీ ఓవర్సీస్ లో మాత్రం మహేష్ క్రేజ్ నడవడం లేదు. కారణం మహర్షి ఓవర్సీస్ డీల్ ఇంకా క్లోజ్ కాలేదట. మహేష్ బాబుకి ఓవర్సీస్ లో అంతగా మార్కెట్ లేదు. గత సినిమాలో కొరటాల దర్శకుడిగా ఉండడంతో... భరత్ అనే నేనుకి మంచి బిజినెస్ ఓవర్సీస్ లో జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం మహర్షిని భారీగా కొనడానికి బయ్యర్లు ఆసక్తి చూపడం లేదట. మహర్షి సినిమా టాక్ బావుంటే.. ఓవర్సీస్ కలెక్షన్స్ కుమ్మెయ్యడం ఖాయమే. టాక్ తేడా కొట్టిందో.... భారీ నష్టాలు బయర్లు చవి చూడడం కూడా నిజమే. కనీసం భరత్ అనే నేను సినిమాకొచ్చిన ధర వచ్చినా చాలని ఇప్పుడు మహర్షి నిర్మాతలు చూస్తున్నారట. కానీ ఆ అమౌంట్ పెట్టేందుకు కూడా డిస్టిబ్యూటర్స్ ముందుకు రాకపోవడం వలనే ఇంకా మహర్షి ఓవర్సీస్ డీల్ క్లోజ్ కాలేదంటున్నారు.              

NO Business to Maharshi at Overseas:

Mahesh Babu Maharshi Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ