‘బాహుబలి’ కోసం ఏకంగా ఎన్నో సంవత్సరాలు కేటాయించిన డార్లింగ్ ప్రభాస్ ఆ చిత్రం కోసం భారీగా కండలు పెంచి పోషించాడు. ఆ తర్వాత ఎంతో కాలానికి సుజీత్ దర్శకత్వంలో తన 19వ చిత్రంగా ‘సాహో’ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం మేకింగ్ వీడియో సంచలనాలు సృష్టిస్తోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో కూడా చాలా భాగం ప్రభాస్ హీమ్యాన్ లుక్‌లోనే కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ కోసం సన్నాహాలు జరుపుకుంటున్నారు. స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇక ‘సాహో’ గ్యాప్‌లో ప్రభాస్ జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీ చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ని యూరప్‌లో ప్రారంభించారు. ప్రభాస్-పూజాహెగ్డేలపై కొన్ని సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు. దాంతో రెండో షెడ్యూల్ కూడా పూర్తయింది. 1970ల నాటి ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. పూర్వకాలంతో పాటు వర్తమానంతో కూడా లింక్ ఉంటుంది. మరి ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడా? లేక డ్యూయెల్ రోల్ పోషించనున్నాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.
తాజాగా విడుదలైన ప్రభాస్ ఫొటోలు చూస్తే ఆయన బాగా బరువు తగ్గి యంగ్‌లుక్‌లో ఇరగదీస్తున్నాడు. ‘డార్లింగ్, మిస్టర్‌పర్‌ఫెక్ట్’ నాటి ప్రభాస్ గుర్తుకు వస్తున్నాడు. అచ్చమైన లవర్‌బోయ్‌లా ఉన్నాడు. ‘సాహోలో యాక్షన్ హీరోగా, ‘జాన్’లో రొమాంటిక్ లవర్‌బోయ్‌లా కనిపిస్తున్న ప్రభాస్ స్వాతంత్య్రదినోత్సవ వేడుకగా ఆగష్టు15న ‘సాహో’, వచ్చే సంక్రాంతికి ‘జాన్’ చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించనున్నాడు.